22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

జపాన్ ప్రయోగశాలలో ప్రతిసృష్టి.

సృష్టికి ప్రతి సృష్టి చేయగల శక్తి ఆ పరమేశ్వరుడికి ఉందని చెబుతారు.. పురాణ కాలం నుంచి తరతరాల వారసత్వంగా వస్తున్న నమ్మకం సృష్టికి ప్రతి సృష్టి చేయగల శక్తి ఆధునిక విజ్ఞానానికి ఉందని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. బిడ్డలను ఋషులు తమ శక్తులతో కుండలలో సృష్టించారని పురాణాల్లో చదవడం, వినడమే గాని మనమెప్పుడూ చూడలేదు. ఆధునిక కాలంలో ఇప్పుడు తల్లి గర్భం కూడా బయటనే అభివృద్ధి చేసి, తల్లి గర్భం లాంటి ఓ యంత్రాన్ని సృష్టించి, తల్లి గర్భంలోని పరిస్థితులను కలగజేసి ఓ బిడ్డను సృష్టించబోతున్నారు . ఈ బిడ్డ ఇప్పుడు కృత్రిమ గర్భంలో పెరుగుతొంది.

ఇది జపాన్ లో సాధించిన అద్భుతం . ఈ కృత్రిమ గర్భాన్ని మానవ శరీరంలో కాకుండా బయటనే పెట్టి దానిలో బిడ్డను పెంచుతున్నారు . ఇదేదో కల్పిత కథ ,సినిమాలలో చెప్పిందో, పురాణాల్లో చెప్పిందో కాదు. నిజంగా జరుగుతున్నదే . జపాన్లోని ఓ ప్రయోగశాలలో ఈ అసాధారణ ప్రయోగం జరుగుతోంది. ప్రపంచంలో మొట్టమొదటి కృత్రిమ గర్భంలో ఈ బిడ్డ పెరుగుతోంది . పురాణ కాలం నాటి మాట నిజం అవుతుంది. గర్భంలో ఉన్న బిడ్డకు ఆక్సి జన్ పోషకాలు, వ్యర్థపదార్థాలు తల్లి గర్భం ఎలా చేస్తుందో ఇక్కడ కూడా అదే విధానంలో చేస్తున్నారు . తల్లి లేకుండానే బిడ్డ పుడుతుంది . తల్లి గర్భం లేకుండానే బయట ప్రదేశాల్లో బిడ్డ మరికొన్ని రోజుల్లో కృత్రిమ గర్భం నుంచి బయటకు రాబోతుంది .

ఈ ప్రయోగం ఇలాంటి ప్రయోగాలకు కొనసాగింపు కాదు. ఇది అనేక నైతిక సమస్యలకు దారితీస్తుంది. మానవసంబంధాలు సవాల్ చేస్తుంది. నెలలు నిండకుండానే పుట్టిన బిడ్డలను సమర్థవంతంగా ఎలా రక్షించాలి ,వారిని ఎలా కాపాడాలి అనేదానికి ఈ ప్రయోగం చేస్తున్నారు. ఇలాంటి కృత్రిమ గర్భంలో ఉంచి నెలలు నిండిన తర్వాత వారిని తల్లిదండ్రులుకు అప్పగించే విధానాలకు ఈ ప్రయోగం ఊతమిస్తోంది .ప్రకృతిని ప్రశ్నిస్తూ ,ప్రకృతిని సవాల్ చేస్తున్న ఈ ప్రయోగాన్ని సైన్స్ పరిభాషలో ఎగ్టోజెనిసిస్ అంటారు . గతంలో పాక్షికంగా ఇలాంటి ప్రయోగాలు జరిగినప్పటికీ ఇప్పుడు పూర్తిస్థాయిలో దీన్ని చేస్తున్నారు..

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.