సైన్స్ పరిజ్ఞానం ఆకాశంలో నుంచి ఊడిపడింది కాదు. ప్రకృతిలో నుంచి పుట్టింది . ప్రకృతిని పరిశీలించే శాస్త్రవేత్తలు విజ్ఞానాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించారు. ఇప్పుడు వీర్యాన్ని భద్రపరిచే విధానం ప్రాణుల్లో ఉంది. అవసరమైతే లేదా అవసరమైనప్పుడు ఆ వీర్యం ద్వారా బిడ్డల్ని పుట్టించే పద్ధతి ఏ ప్రాణిలో ఉందో తెలుసా ..? అది గబ్బిలాలలో ఉంది. ఆడ గబ్బిలాలు మగ వీర్యాన్ని నెలలపాటు దాచుకుంటాయని చాలామందికి తెలియదు . కానీ ఇది నిజం. అక్టోబర్ మరియు నవంబర్ నెలలో ఆడ మరియు మగ గబ్బిలాలు సంపర్కం చెందుతాయి. ఆ సంపర్కం చెందినప్పుడు మగ్గ గబ్బిలం అడ గబ్బిలంలో విడుదల చేసే వీర్యం దాని శరీరంలోని ఒక గ్రంధిలోనే భద్రపరచుకుంటుంది .
మగ గబ్బిలం వీర్యం విడుదల చేసినప్పుడు అడ గబ్బిలం అండం విడుదల చేయదు. అందువల్ల వీర్యం ఫలదీకరణం కాదు . అండోత్పత్తి జరగదు . మగ గబ్బిలం విడుదల చేసిన వీర్యాన్ని ఒక ప్రత్యేకమైన గ్రంధిలో దాచుకుని ఆడగబ్బిలం భద్రపరుస్తుంది. దానిని 8 నెలల తర్వాత అంటే జూన్ లేదా జూలై నెలలో తనలో దాచుకున్న మగ వీర్యాన్ని ఆడగబ్బిలం బయటకు వదిలి , తనలోని అండం విడుదల చేస్తుంది. అప్పుడు ఫలదీకరణం జరిగి సంతానోత్పత్తికి బీజం ఏర్పడుతుంది. చూసారా , యెంత అద్భుతమైన సృష్టి మర్మమో,
ఇలాంటి ప్రాణులనుంచే వీర్యం భద్రపరిచే సాంకేతికత పుట్టింది. ఎనిమిది నెలల క్రితం మగ గబ్బిలం నుంచి శరీరంలోని గ్రంధిలో దాచుకున్న వీర్యాన్ని తను విడుదల చేసే అండంతో అండోత్పత్తి చేసి బిడ్డనికంటుంది గబ్బిలం. గబ్బిలం క్షీరథం జాతికి చెందిన జంతువు . అవి పిల్లలకు పాలిస్తాయి . చూశారా నేటి సాంకేతికత నేటి ఫెర్టిలైజేషన్ విధానం లేదా టెస్ట్ బేబీ విధానం లేదా ఇలాంటివన్నీ అద్భుతం అని మనం అనుకుంటుంటే అవి గబ్బిలంలోనే నిక్షిప్తమై ఉన్నాయి . అందుకే విజ్ఞానానికి పునాది జీవుల జీవన విధానమే.. ఎంత అద్భుతమైన ప్రకృతి ప్రకృతి రహస్యము తెలిసింది కదా..
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

