22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

శ్రీనగర్ లో ఆటోడ్రైవర్ మానవత్వం.

విద్వేష సెగలు, విద్రోహ చర్యలు, ఉగ్రవాదుల ఉన్మాదంతో అట్టుడికి పోతున్న కాశ్మీరంలో మానవత్వం ,మతపరమైన సామరస్యం కూడా వెల్లివిరుస్తోంది. ఉగ్రవాద ఉన్మాదంతో కాశ్మీరం మళ్ళీ పేదరికం, కష్టాల కొలిమిలోకి పొతొంది. వ్యాపారాలు మళ్ళీ మూతపడే పరిస్థితి. అందుకే అక్కడ స్థానికులు ఉగ్రవాద చర్యలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. సామరస్య సుగందాలు వెదజల్లుతున్నారు.

అలాంటి సంఘటన ఇది. శ్రీనగర్లో ఓ ఆటో డ్రైవర్ మానవత్వం ఇది. రషీద్ అనే ఈ ఆటో డ్రైవర్ అత్యవసరంగా రైల్వేస్టేషన్ కానీ, ఏర్పోర్ట్ కానీ పోవాలనుకుంటున్నా ప్రయాణికులను ఎటువంటి చార్జీ లేకుండా తన ఆటోలో తీసుకుపోతానని ఆటోకు ఓ కాగితం అంటించి మైక్ లో చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. వారికి అవసరమైన ఆహారం కూడా తానే తీసుకొచ్చి ఇస్తానని అందువల్ల అలా ఎవరైనా పోదలుచుకుంటే తన నెంబర్ కు కాల్ చేయాలంటూ ఆటోలో తిరుగుతూ సమాచారం ఇస్తున్నాడు.

చాలా ఏళ్లుగా కాశ్మీర్ పర్యాటకులు లేకపోవడంతో వ్యాపారాలు లేక దెబ్బతినింది. ఇటీవల కాలంలోనే కాశ్మీర్ ప్రశాంతంగా ఉండటంతో పర్యాటకులు పోతున్నారు. అక్కడ స్థానికులు వ్యాపారాలు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఉగ్రవాద చర్యలతో కాశ్మీర్ లో పరిస్థితి మొదటికొచ్చే దుస్థితి ఉంది. ఉగ్రవాదుల ఉన్మాద చర్య దారుణ సంఘటన అని రషీద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు . అందరూ అన్నదమ్ములన్న భావాన్ని భారతీయ భారతీయులం అన్న ఒక సద్భావనను తుడిచివేసి కాశ్మీర్ ని అల్లకల్లోలం చెయ్యాలన్న పాకిస్తాన్ కుట్రలను తాము సాగనివ్వబోమని చెబుతున్నాడు.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.