నేటి రోజుల్లో కుర్రాళ్లకు.. పెళ్లిళ్లు కావాలంటేనే కష్టంగా మారింది. ఆస్తులు ఉన్నా.. అంతస్తులు ఉన్నా.. ఇంకా ఏదో కావాలంటూ అమ్మాయిలు పెళ్లిళ్లకు ఇష్టపడటం లేదు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. మహేష్ బాబు లాంటి అందం.. ప్రభాస్ లాంటి బాడీ ఉన్నా కూడా అమ్మాయిలకు సరిపోవడం లేదు. కోట్లాది రూపాయల ఆస్తులు.. అత్తగారింట్లో అడుగుపెట్టగానే పెత్తనం కావాలంటూ పెళ్ళికి ముందే కండిషన్లు పెట్టే రోజులివి.. ఇలాంటి రోజుల్లో అబ్బాయిలకు పెళ్లిళ్లు కావాలంటే కష్టంగా మారింది. పెళ్ళికి అమ్మాయి దొరకడమే గగనంగా మారింది.ఇలాంటి రోజుల్లో ఓ యువకుడికి అదృష్టం వరించింది.
ఒక్క అమ్మాయి దొరకడమే కష్టంగా మారిన ఈ రోజుల్లో ఇద్దరితో పెళ్లి ఫిక్స్ అయ్యింది. అది కూడా అక్కాచెల్లెళ్ళతో.. ఆ అక్కాచెల్లి ఇద్దరూ ఎలా ఓకే చేశారో తెలీదు కానీ.. పెళ్లి మాత్రం కుదిరింది. పెళ్లి కార్డులు కూడా ప్రింట్ అయిపోయాయి. పెళ్లి పత్రికను ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు. ఇంకేముంది.. ఆ పెళ్లి వార్త కాస్తా వైరల్ గా మారింది.అంతా హ్యాపీ.. అనుకునే సమయానికి పోలీసులు.. పెళ్ళికొడుకుని స్టేషన్ కు పిలిపించారు. తమరు పెళ్లి చేసుకునే అమ్మాయిలు ఇద్దరూ మైనర్లని చెప్పి.. వార్నింగ్ ఇచ్చారు. ఇరు కుటుంబాల పెద్దలను పీఎస్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. పెళ్లి ఆపకపోతే ఇరుకుటుంబాలపై కేసులు పెడతామని హెచ్చరించారు. దీంతో అక్కా చెల్లి.. ఇద్దరినీ చేసుకుందామనుకున్న, పెళ్ళికొడుకు ఆశలు కాస్తా అడియాసలు అయిపోయాయి.. పాపం ఏం చేస్తాం.. నోటిదాక వచ్చిన కూడు నేలపాలు కావడం అంటే ఇదేనేమో..!

