ఓ అరబ్ షేక్ తన భార్య ఈతకొట్టేందుకు ఓ ఐలాండ్ కొన్నాడు.. అసలు దుబాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం టర్నోవర్ ఏంతో తెలిస్తే కళ్ళు తిరిగిపోతాయి. విలాసాలకు , విహారాలకు విదేశాలలో ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో మించిన జీవనశైలి ఎక్కడా ఉండదు . పుష్కలంగా డబ్బులు ,అంతులేని సంపాదన ఉండడంతో అరబ్ షేకుల జీవన శైలి ఊహించనంత విలాసంగా ఉంటుంది . ఓ దుబాయ్ వ్యాపారవేత్త తన భార్య అందరూ ఈత గొట్టే స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టడం ఇష్టం లేక ఆమె కోసం వందల కోట్ల రూపాయలు ధారపోసి ఒక ద్వీపం కొనుగోలుచేసాడు. ఆ షేక్ పేరు జమాల్ అల్ నదఖ్ , ఆమెపేరు సౌదీ అల్ నడక్ . వారిద్దరూ మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. విలాసవంతమైన జీవితం వారి సొంతం. తమ ఐలాండ్ పోటోలను వారే ఇంస్టాగ్రామ్ లో వీడియో , ఫొటోల ద్వారా షేర్ చేశారు . ఆమె బికినీ వేసుకొని స్విమ్మింగ్ చేసేందుకే అది ఎవరు చూడకూడదని ఆ కుబేరుడు ఈ ద్వీపాన్ని ఆమెకు కొనిచ్చి బహుమతిగా ఇచ్చాడు.

సముద్రం మధ్యలో ఉన్న ఈ ద్వీపంలో 50 మిలియన్ డాలర్ల డబ్బులు వెచ్చించి ఆయన ఆ ద్వీపాన్ని సొంతం చేసుకున్నాడు . ఆ ద్వీపంలో తన భార్య ఒక్కటే హాయిగా ఈత కొట్టుకోవచ్చు అనేది ఆయనకు ఆలోచన . అందువల్ల ఆద్వీపంలోకి ఎవరిని రానివ్వకుండా నిషేధించి తన భార్య స్విమ్మింగ్ కోసం దాన్ని వాడుకుంటున్నాడు. అత్యంత అధునాతనమైన విలాసవంతమైన జీవనశైలి గల్ఫ్ ప్రాంతంలో ఎలా ఉంటుందో ఇది ఒక ఉదాహరణ. ప్రవేట్ ఐలాండ్స్, ప్రత్యేకమైన రిసార్ట్స్ కు, సొంత రిసార్ట్స్ కు గల్ఫ్ దేశాల్లో ఎంత డిమాండ్ ఉందో ఇదే ఒక ఉదాహరణ . వ్యక్తిగత స్వేచ్ఛ కోసం, వ్యక్తిగత జీవితాలు గోప్యంగా ఉంచాలన్న దానికోసం గల్ఫ్ దేశాల్లో ఎంతైనా ఖర్చు పెడతారు . అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో రియల్ ఎస్టేట్ రంగం గల్ఫ్ దేశాల్లో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది . ప్రపంచ దిగ్గజాలైన రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా గల్ఫ్ దేశాల్లో ఇప్పుడు కంపెనీలు ప్రారంభించి వ్యాపారం చేస్తున్నాయి. ఒక్క దుబాయిలోనే ఏడాదికి 17 లక్షల కోట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతొంది. మనదేశంలో మాదిరి ఎవరంటే వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకూడదు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా కూడా ఉండకూడదు. ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలకు లోబడి , అనుమతులు తీసుకుని వ్యాపారం చెయ్యాలి.
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు
ఇదేమి కోరిక తాతయ్యా , విచిత్రంగా ఉందే..
భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

