వైసిపి హయాంలో వంగలపూడి అనితని గృహనిర్బంధంలో ఉంచి ఇంటికి కాపలా ఉన్న మహిళా కానిస్టేబుల్ రేవతికి , హోమ్ మంత్రి అనిత శ్రీమంతం జరిపింది. అప్పట్లో ఏ కానిస్టేబులో విశాఖపట్నంలోని ఎవిపి కాలనీ పోలీస్ స్టేషన్లో పనిచేసేది. ఆ పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ గా రేవతి ఉండింది. అయితే ఇప్పుడు గర్భవతిగా ఉన్న రేవతికి మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీమంతం జరిపేందుకు హోమ్ మంత్రి అనిత ఆమె ఇంటికొచ్చారు.

ఆమెకు పసుపుకుంకుమలు సారెపెట్టి, గాజులు తొడుగుతుండగా కానిస్టేబుల్ రేవతి కన్నీరు పెట్టింది. వైసిపి హయాంలో జరిగిన సంఘటన గుర్తుకొచ్చిందని , మిమ్మల్ని ఆ రోజు నిర్బంధంలో ఉంచిన నాకే , ఈ రోజు మీరు శ్రీమంతం చేస్తున్నారని కన్నీరు పెట్టింది. విధినిర్వహణలో అవన్నీ సాధారణమేనని చెప్పి , ఓదార్చి ఆమెకు శ్రీమంతం పూర్తిచేసి హోమ్ మంత్రి బయలుదేరింది..

