నేపాల్ లో చిక్కుకున్న తెలుగుపౌరులను తరలించేందుకు రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఉదయం నుంచి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. నేపాల్ లోని 12 ప్రదేశాల్లో చిక్కుకున్న 217మందిని సురక్షితంగా రాష్ట్రానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలివిడతగా నేపాల్ లోని హెటౌడా నుంచి 22మంది తెలుగుపౌరులను సురక్షితంగా బీహార్ బార్డర్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మిలటరీ సాయంతో హెటౌడా నుంచి 58 కి.మీ దూరంలో ఉన్న బీహార్ బోర్డర్ మోతిహరికి తెలుగుపౌరులు బయలుదేరారు. బీహార్ లోని మోతిహరి నుంచి తెలుగుపౌరులను రాష్ట్రానికి తరలించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
నేపాల్ లో చిక్కుకున్న 217మందిలో 118మంది మహిళలు కాగా, 99మంది పురుషులు ఉన్నారు. విశాఖపట్నం వాసులు 42మంది, విజయనగరం 34మంది, కర్నూలుకు చెందిన వారు 22మంది కాగా, మిగిలిన వారు ఇతర జిల్లాలకు చెందిన వారు. తమను క్షేమంగా తరలిస్తున్న మంత్రి లోకేష్ కు తెలుగు ప్రజలు తెలిపారు. నేపాల్ లో చిక్కుకున్న 217మంది తెలుగు పౌరుల్లో 173మంది ఖాట్మాండూ పరిసరాల్లోని హోటళ్లలో తలదాచుకున్నారు. 22మంది హెటౌడాలో వీరు మిలటరీ సాయంతో బయలుదేరారు, 10మంది ఖాట్మాండూకు సమీపంలోని పోఖ్రాలో, 12మంది సిమి కోట్ లో ఉన్నారు.
నేపాల్ లోని వివిధ హోటళ్లలో తలదాచుకున్న బాధితులతో మంత్రి లోకేష్ వీడియో కాల్ మాట్లాడుతూ వారికి ధైర్యం చెబుతున్నారు. ప్రతి రెండుగంటలకు ఒకసారి వివిధ ప్రాంతాల్లో ఉన్న బాధితులతో మాట్లాడుతున్నారు. నేపాల్ లోని ముక్తినాథ్ యాత్రకు వెళ్లి చిక్కుకున్న విశాఖకు చెందిన సూర్యప్రభతో మంత్రి లోకేష్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఖాట్మాండులోని పశుపతినాథ్ టెంపుల్ సమీపంలోగల రాయల్ కుసుమ్ హోటల్ లో విశాఖకు చెందిన 84మంది తలదాచుకున్నారు. రోజారాణి అనే మహిళతో మాట్లాడిన లోకేష్… అధైర్య పడొద్దు… మిమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత మాది అని భరోసా ఇచ్చారు.
ఖాట్మాండులోని పశుపతి ఫ్రంట్ హోటల్ లో తలదాచుకున్న మంగళగిరికి మాచర్ల హేమ సుందర్ రావు, నాగలక్ష్మిలతో మంత్రి లోకేష్ వీడియో కాల్ లో మాట్లాడారు. మంగళగిరికి చెందిన 8మందితో పాటు ఆ హోటల్ లో మొత్తం 40మంది తలదాచుకున్నట్లు వారు తెలిపారు. నిన్న తాము ప్రయాణిస్తున్న బస్సుపై ఆందోళనకారులు హఠాత్తుగా దాడిచేశారని, తాము ప్రాణాలు అరచేతబట్టుకొని హోటల్ కు చేరుకున్నట్లు వారు చెప్పారు.
తాము ఖాట్మాండు ఎయిర్ పోర్టుకు కేవలం కిలోమీటరు దూరంలోనే ఉన్నామని తెలిపారు. భయపడవద్దని… క్షేమంగా రాష్ట్రానికి తీసుకువస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. ఢిల్లీలోని ఎపి భవన్ సీనియర్ అధికారి అర్జా శ్రీకాంత్ తో సిఎంఓ అధికారి కార్తికేయ మిశ్రా బాధితులకు సహాయ చర్యలపై నిరంతరం సంప్రదిస్తున్నారు. మంత్రి లోకేష్ ఆదేశాలకు అనుగుణంగా ఎపిఎన్ఆర్ టి చైర్మన్ వేమూరి రవికుమార్, సిఇఓ కృష్ణమోహన్ సహాయచర్యలను సమన్వయం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

