అమెజాన్ అడవుల్లో అంతుపట్టని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. బ్రెజిల్ కేంద్రంగా తొమ్మిది దేశాల్లో అమెజాన్ అడవులు విస్తరించి ఉన్నాయి. భూగోళానికి అవసరమైన 20 శాతం ఆక్సిజన్ అమెజాన్ అడవులను నుంచే వస్తుందంటే అమెజాన్ అడవులు ఎంత పెద్దవో ఊహించుకోవచ్చు . ఇది ప్రపంచంలో అతిపెద్ద రెయిన్ ఫారెస్ట్ .అమెజాన్ నది కూడా పెద్దది . అమెజాన్ అడవుల్లో వృక్ష, జంతు జీవజాలాన్ని ఇంతవరకు పూర్తిగా జల్లెడ పట్టిన శాస్త్రవేత్త లేడు . ఇది అంతుచిక్కని మరో లోకం.
తాకితే కాటేసే వృక్షాలు, పట్టుకుంటే చనిపోయే మనుషులు, మనుషులను చంపే కీటకాలు, బయట లోకానికి తెలియని ఆదిమజాతులు, కీటకాలు ఇలా అనేక రకాలుగా చిత్ర విచిత్ర వృక్షజాతులకు, జంతుజాలాలకు అది నిలయం. అలాంటి అమెజాన్ అడవుల్లో ఉండే ఒక రకమైన తేళ్లు విషం మానవాళికి శాపంగా తయారైన క్యాన్సర్ ముందుగా ఉపయోగపడుతుందని తేలింది. క్యాన్సర్ ఔషధంగా ఇది ఇది అద్భుతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రయోగశాల పరీక్షల్లో విజయవంతమై, ఇక క్లినికల్ ట్రయల్స్ కు రావాల్సి ఉంది. అమెజాన్ లో ఉండే ఒకరకమైన తేలులో ఉండే ఈ విషం మహిళల్లో వక్షోజ క్యాన్సర్ లో ఉండే కణాలను నిర్వీర్యం చేసి నాశనం చేస్తుందని తేలింది .ఈ విషంలో బమాస్ ఎస్సిపిఎల్పి వన్ అనే పదార్థం ఉంది. ఇది బ్రోథియాస్ అమెజాన్ అనే తేలు విషంలో మాత్రం ఎక్కువ కనిపిస్తుంది.ఈ విష రసాయనాన్ని క్యాన్సర్ కణాలపై వేస్తే వెంటనే ఆ కణం పగిలిపోయి నిర్వీర్యం అవుతుంది. ఇది కీమోతెరిపి లో ఉపయోగించేబ్యాక్ క్లిట్ ఆక్సిల్ అని మందు లాగానే పనిచేస్తోంది . అయితే ఆ మందులు కున్న సైడ్ ఎఫెక్ట్స్ ఈ తేలు విషానికి లేవు .

