ఇది వైజ్ఞానిక యుగం, విజ్ఞానం పెరిగే కొద్దీ యాంత్రికరణ యధావిధిగా జరిగిపోతుంది. యాంత్రీకరణ పెరిగే కొద్దీ నిరుద్యోగం కూడా ప్రబలుతుంది. అందువల్ల యువకులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉపాధి అవకాశాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి . తాజాగా చైనాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త పుంతలు తొక్కింది . ప్రస్తుతానికి బీజింగ్ లోని ఓ హాస్పిటల్ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మెడికల్ డాక్టర్స్ ని ప్రవేశపెట్టారు .అంటే వీళ్ళు మనుషులు కాదు . ప్రస్తుతం ఇతర హాస్పిటల్స్ లో ఉన్నట్టు జబ్బులు చెప్పేందుకు జూనియర్ డాక్టర్లు గాని ,లేదా టెస్టులు చేసేందుకు ల్యాబ్ టెక్నీషియన్లు కానీ, మందులు రాసేందుకు డాక్టర్ గాని ఉండరు.
పేషంటు హాస్పిటల్ కి వస్తూనే ఏటీఎం కౌంటర్ లాగే ఉండే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఒక గది లాంటి ఏర్పాటై ఉంటుంది. చైనాలో ఇలాంటి 14 గదులతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్స్ రూమ్ అని పెట్టారు . ఆ గదిలోకి పోయిన తర్వాత సెకండ్లలో పేషెంట్ ను పరీక్షించి అన్ని రకాల వైద్య పరీక్షలతో సహా జబ్బును కూడా ప్రాథమికంగా నిర్ధారణ చేసి రిపోర్టు వచ్చేస్తుంది. దానిలోనే ఆ పేషెంట్ కున్న రోగ లక్షణాలను బట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యాధి నిరాదరణ చేస్తోంది. సూదిలేకుండానే రక్త పరీక్షలు, గుండె ,కాలేయం ,మూత్రపిండాలు ,మూత్రం, ఇలాంటివి అన్ని పరీక్షల దృష్ట్యా ఆ జబ్బు ఏమిటో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూమ్ డిసైడ్ చేస్తుంది .
పేషెంట్ కు క్యాన్సరా , గుండె జబ్బు, లేదా ఇతరత్రా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అన్నది వివరంగా ఒక నివేదిక వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్స్ రూంలో తీసుకున్న నివేదికను సీనియర్ డాక్టర్ కి ఇచ్చి మందులు రాయించుకోవడమే. ప్రస్తుతానికి మాత్రమే ఈ ఏర్పాటు ఉంది .భవిష్యత్తులో ఇది మరింత అభివృద్ధి చెంది మొదట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్స్ రూమ్ ఆ జబ్బుకు ఏ మందులు ఎప్పుడూ ఎన్ని వాడాలో చెప్పేస్తుంది. రెండు సెకండ్లలో రిపోర్టు కూడా వచ్చేస్తుంది . ఆ రిపోర్టు తీసుకొని మందులు కొనుక్కొని ఇంటికి వెళ్లడమే చేయవలసిన పని .
ఆ తర్వాత కూడా వచ్చే పరిణామాలను ఒక కోడ్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఇంట్లో నుంచి కంప్యూటర్ లో ఫీడ్ చేస్తే అది మళ్ళీ ఆన్లైన్లో స్కాన్ చేసి మార్పులను గమనించి సూచనలు కూడా చేస్తుంది . అంటే భవిష్యత్తులో డాక్టర్లతో పనిలేని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ల వ్యవస్థ ఇప్పుడు ప్రాథమికంగా ఈ హాస్పిటల్లో మొదలైంది .అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్స్ తర్వాత హాస్పిటల్లో డాక్టర్ల సంఖ్య 70 శాతానికి తగ్గిపోతుంది. హాస్పిటల్లో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు సంఖ్య 80 శాతానికి పడిపోతారు . అలాగే ఇతరత్రా మినిస్ట్రీ రియల్ స్టాప్ 50 శాతానికి పడిపోతారు . గదుల్లో చేరి వైద్యం తీసుకోవాల్సిన పరిస్థితి కూడా గణనీయంగా తగ్గిపోతుంది.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

