రెండు తెలుగు రాష్ట్రాలలో గత నెల రోజులుగా అఘోరి పేరుతో జరుగుతున్న రచ్చ మామూలుగా లేదు.. ఈ అఘోరి అలియాస్ శ్రీనివాస్ ను మన తెలుగు మీడియా కూడా బాగానే వాడుకుంది. టీఆర్ఫీల కోసం అఘోరి, వర్షిణి అనే యువతి ప్రేమ, పెళ్లి వార్తలను అదే పనిగా ప్రసారం చేసింది. కొన్ని ఛానల్స్ అయితే ఏకంగా డిబేట్ లు కూడా నడిపేశాయి. సోషల్ మీడియా కూడా ఈ స్క్రాప్ ని బాగానే వైరల్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ అఘోరినే కనిపించేవాడు.
అయితే ఇన్నాళ్లకు ఈ అఘోరిగాడి పాపం పండింది. ఓ మహిళ వద్ద పూజలు చేయిస్తానని చెప్పి.. దాదాపుగా 10 లక్షల రూపాయలు మోసం చేసి తీసుకున్నాడు. ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అఘోరిని.. అతడితో ఉంటున్న వర్షిణిని కూడా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ఉండగా తెలంగాణ పోలీసులు పట్టుకొని తీసుకొచ్చారు.
అఘోరిని చేవెళ్ల కోర్టులో హాజరుపరచగా.. కోర్టు అఘోరికి 14 రోజుల రిమాండ్ విధించింది. అఘోరిని పోలీసులు కంది సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు. అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది.. అఘోరిని మగాళ్ల బ్యారక్ లో ఉంచాలా.. లేక మహిళల బ్యారక్ లో ఉంచాలా జైలు అధికారులకు అర్ధం కాలేదు. లింగ నిర్ధారణ కాకుండా తాము జైల్లో ఉంచుకోలేమని జైలు అధికారులు చెప్పడంతో.. పోలీసులు చేసేదేమీ లేక అఘోరిని మళ్ళీ కోర్టుకి తీసుకొచ్చారు. దీంతో అఘోరికి వెంటనే లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలని కోర్టు ఆదేశించింది.

