వైసిపి అధికారంలో ఉండగా , కూటమి పార్టీలు, నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ వాళ్లలో రాజకీయాలకు దూరంగా ఉంటూ తిట్ల దండకాలలో ఉద్దండులు పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి.. వీరిద్దరూ చంద్రబాబు కుటుంబ , వ్యక్తిగత విషయాల్లో రోతపుట్టించే విమర్శలు చేసారు. చివరకు ఇంట్లో భార్యలు, కూతుళ్లు వరకు నీచంగా మాట్లాడిన వారిలో పోసాని ఒక అడుగుముందేసాడు.

విచిత్రంగా ఎన్నికల్లో వైసిపి దారుణ ఓటమి తరువాత , వైసిపికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు. తప్పులు క్షమించమని కూడా అడిగాడు. ఇక రాజకీయాల జోలికి రానన్నాడు. అయితే ఇది నాటకమని ఇప్పుడు తేలింది.. తన గురించి కొత్త ప్రభుత్వం ఆలోచించకుండా ఉండేందుకు , తానూ చేసిన విమర్శల గురించి పట్టించుకోకుండా ఉండేందుకు ఇది నాటకమని తేలిపోయింది. ఇప్పుడు పోసాని అరెస్ట్ విషయంలో వైసిపి సర్వం తానై అండగా నిలిచింది. తమ న్యాయ బృందాన్ని, నాయకులను పోసానికి అండగా ఉంచింది. జగన్ స్వయంగా జోక్యం చేసుకొని మాట్లాడుతున్నారు.

దీన్ని బట్టి వైసిపి ఆదేశాలమేరకు గతంలో వీళ్ళు పార్టీకి రాజీనామా ఇచ్చి దూరం జరిగినట్టు నాటకం నడిపించారని తెలుస్తోంది. శ్రీ రెడ్డి విష్యం కూడా ఇదే కోవలోకి వస్తుంది. కాకపోతే ఆమె మహిళ .. అందునా వంగి, వంగి దండాలు పెడుతూ క్షమాపణలు చెప్పుకుంది.. అవిఏమైనా పనిచేస్తే తప్ప , ఆమె మీదకూడా పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఉన్నాయి.. ఏమి జరుగుతుందో చూడాలి..

