సినీహీరో , నందమూరి బాలకృష్ణ కి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని అందజేసింది. ఇందుకోసం బాలకృష్ణ కూతుళ్లు , అల్లుళ్లతో కలిసి రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. పౌర పురస్కారాలలో అత్యున్నత స్థాయిలో ఉండేది పద్మభూషణ్ సత్కారం ఒకటి.
సినీ నటులలో ఇప్పటి తరం బ్రతికున్నతెలుగు నటులలో చిరంజీవి తరువాత ఈ బిరుదు దక్కిన నటుడు బాలకృష్ణ . అందుకే బాలయ్య కుటుంబ సమేతంగా ఈ వేడుకకు తరలి వచ్చారు. రాష్ట్రపతి భవన్ లో జరిగే పౌర పురస్కారాల వేడుకకు ముందే , రాష్ట్రపతి భవన్ ముందునిలబడి భార్య , కూతుళ్లు, అల్లుళ్లతో, కొడుకు , సోదరి భువనేశ్వరితో కలిసి బాలకృష్ణ ఫొటో తీయించుకున్నారు..

