22.5 C
New York
Saturday, April 4, 2026

Latest Posts

పాక్ హై కమీషన్ ముందు హనుమాన్ చాలీసా ..

పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీస్ ముందు హనుమాన్ చాలీసా పఠనంతో భారతీయులు నిరసన వ్యక్తం చేశారు. లండన్లోని భారతీయులు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి నిరసనగా మరియు పెహల్గాం దారుణ మారణ కాండకు , ఉన్మాద ఉగ్రవాదానికి నిరసనగా లండన్లోని పాకిస్తాన్ హై కమిషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. అయితే అదే సమయంలో పాకిస్తాన్ హై కమిషన్ కు చెందిన కొందరు అధికారులు హేళన చేయడం మొదలుపెట్టారు.

బ్రిటన్ లో ఉంటున్న కొందరు పాకిస్తానీయులు కూడా దారిన పోయేవారు ఆగి , హనుమాన్ చాలీసా పఠిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న భారతీయులను ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. దీంతో ఎక్కువ సంఖ్యలో భారతీయులు అక్కడకు చేరుకొని , పెద్ద స్వరంతో హనుమాన్ చాలీసా పఠిస్తూ నిరసన తెలిపారు.

శాంతియుతంగా నిరసన చేస్తున్న భారతీయులను హేళన చేస్తూ వారిని తీవ్రంగా పాక్ ఎంబసీ అధికారులు దూషించడంతో స్థానికులు కూడా ఆగ్రహవేషులయ్యారు. అయితే భారతీయుల మాత్రం ఎటువంటి ప్రతి చర్యకు పాల్పడకుండా హనుమాన్ చాలీసా పఠిస్తూ కమిషన్ ఆఫీస్ ముందు నిరసన కొనసాగించారు.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.