తిరుమలలో వేసవి సెలవుల రద్దీ విపరీతంగా ఉంది. ఇది మే నుంచి మరింత ఎక్కువ కాబోతుంది. దీంతో మే నెల ఒకటో తేదీ నుంచి జులై 15 తేదీవరకు అంటే 75 రోజులు పాటు సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు ఉండవు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ,మంత్రులు ఇలా సిఫార్సు లేఖలు తీసుకొచ్చి బ్రేక్ దర్శనం కోరే భక్తులుకు ఇక ఆ అవకాశం లేనట్టే. ఆశలు అడుగంటినట్టే..
మే నెల ఒకటో తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు సిఫార్సు లేఖలను అనుమతించబోమని ,వాటిపై దర్శనాలు ఇవ్వపోవడం లేదని టిటిడి ప్రకటించింది. సెలవు రోజుల్లో భక్తుల రద్దీ దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రోటోకాల్ విఐపి లకు మాత్రమే బ్రేక్ దర్శనాలు ఉంటాయని వారు ఇచ్చే సిఫార్సు లేఖ తీసుకొచ్చి ఎవరైనా బ్రేక్ దర్శనాలు అడిగితే లేఖలు కూడా తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
సెలవు దినాల్లో రోజురోజుకీ రద్దీ పెరిగిపోతుంది . పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా దర్శనాల సమయం కూడా పెరిగిపోతోంది. దాదాపు 24 గంటలు పైగా కూడా ఉచిత దర్శనానికి సమయం తీసుకుంటుంది . దీంతో టిటిడి ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంది. బ్రేక్ దర్శనాలవల్ల ఉదయం రెండు గంటలు సమయం వృధా అవుతొంది. ఇప్పుడు సగటున తిరుమలలో స్వామి దర్శనానికి రోజుకి 80 వేలమంది భక్తులు వస్తున్నారు. దీంతో కొండ భక్త జనంతో క్రిక్కిరిసిపోతొంది..

