గత ప్రభుత్వ హయాంలో 3200 కోట్ల మద్యం కుంభకోణం కథ అటు తిరిగి ఇటు తిరిగి, అన్ని మలుపులు తిరిగి జగన్ ఇంటి వాకిట వద్దకు వచ్చి ప్రస్తుతానికి ఆగి ఉంది . గత ప్రభుత్వాలు లోకల్ బ్రాండ్స్ ప్రవేశపెట్టి కొనుగోళ్లలో ఆన్లైన్ పేమెంట్లు, ఫోన్ పే లాంటివి నిషేధించి కేవలం డబ్బులు ఇస్తేనే మందు అన్న విధానాన్ని ప్రవేశపెట్టి , స్వంతంగా తమ బినామీలకు లైసెన్సులు ఇచ్చి ఈ కుంభకోణానికి తెరదీశారన్నది ఆరోపణ.
ఇంతకుముందు పేరున్న బ్రాండ్లను పక్కనపెట్టి కేవలం స్థానికంగా కొత్తగా తయారు చేసే చీప్ బ్రాండ్లను తీసుకురావడంతో కుంభకోణం మొదలైంది.ఈ కేసులో అరెస్టైన ముఖ్యులందరూ కుంభకోణం లోగుట్టు విప్పిచెప్పేశారని స్పష్టమైంది. అయితే ఇక్కడో కీలక విషయం తేలాలి.. మొదట్లో ఈ కుంభకోణంలో పాత్రధారిగా భావించిన విజయసాయిరెడ్డి ఇప్పుడు అప్రూవర్ గా మారారా..? ఆయనే లిక్కర్ సిండికేట్ గుట్టు మొత్తం చెప్పారా ..? అన్నదే ఇప్పుడు కీలలమైన అనుమానం.. అందువల్లనే రోజుల్లోనే ఈ కుంభకోణం గుట్టు మొత్తం రట్టు అయిందంటున్నారు.
ఇప్పుడు జగన్ ఆస్థానంలోని ఇద్దరు వద్దకు చివరకు ముడుపులు చేరాయని సిఐడి తేల్చింది. ఆ ఇద్దరి నుంచి ఎవరికి, ఎక్కడికి, ఎలా చేరాయో తెలిస్తే అప్పుడు బిగ్ బాస్ పై కేసు నమోదు అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి వైసీపీలో మద్యం కుంభకోణం కలకలం రేపుతుంది . అయితే పార్టీ నాయకత్వం ఆదేశంతో ప్రతి జిల్లాలో వైసిపి నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మద్యంకోణం జరగలేదని, రాజకీయ కక్షతో చేస్తున్నారని మీడియాతో చెప్పిస్తున్నారు. జగన్ ప్రవేశపెట్టిన మద్యం విధానం దేశంలోకెల్లా ఉత్తమమైనదని కూడా చెప్పిస్తున్నారు. ఈ కుంభకోణం నుంచి బయటపడేందుకు వైసీపీ ఇప్పుడు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

