రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే సంచలనం సృష్టించిన అనంతపురంలోని కియా కార్ల ఫ్యాక్టరీ నుంచి కారు ఇంజన్ ల చోరీ కేసులో సంచలనమైన విషయాలు బయటకొస్తున్నాయి. ఫ్యాక్టరీ నుచి గత రెండేళ్లలో చోరీ చేసిన 900 కారు ఇంజన్లలో ఢిల్లీలో కొన్ని, చెన్నైలో కొన్ని అమ్మినట్టు తేలింది.
చోరీ జరిగిన రెండేళ్లకు ఆడిటింగ్ లో ఈ విష్యం బయటపడిన సంగతి తెలిసిందే..పోలీసుల కస్టడీలో ఎనిమిది మంది నిందితులకు గానూ ఆరుగురిని తీసుకొని కీయ కారు ఇంజన్లు ఎక్కెడెక్కడ అమ్మారో చూపాలంటూ పోలీసులు వారిని ఢిల్లీ, చెన్నైకి తీసుకెళ్లారు.

