కాశ్మిర్ లో ఉగ్రవాదుల దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకే భారత్ సిద్ధమైంది. రెండు దేశాలమధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. సరిహద్దుల్లో కీలకస్తావరాలకు సైనిక దళాలు ,విమానాలు మోహరిస్తున్నారు. సముద్రంలో నౌకాదళ విన్యాసాలు మొదలయ్యాయి. ఇప్పుడు యుద్ధమే తరువాయి.. తాజా యుద్ధ సన్నాహాలకు ఆక్రమణ్ అనే పేరు పెట్టారు. ఈ పేరులోనే అసలు విషయం తెలిసిపోతుంది. ఒకప్పుడు కాశ్మీర్లో అంతర్భాగంగా ఉన్న భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకుని దాన్ని పిఓకే గా పిలుచుకుంటుంది. అంటే ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్. దీనిని స్వాతంత్ర సంపత్తి ఉన్న ప్రాంతంగా ప్రకటించినప్పటికీ దాన్ని తమ అధీనంలోనే ఉంచుకుంది. సరిహద్దులలో ఉగ్రవాదులను, ఉగ్రవాదశిబిరాలను పెంచి పోషిస్తోంది.
అందువల్ల యుద్ధం జరిగితే మొట్టమొదట పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో విలీనం చేసుకోవడమే ఇప్పుడు ఏకైక లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెబుతున్నారు. సైనిక దళాలు ఆ దిశగానే ముందుకు కదులుతున్నాయని తెలుస్తోంది. ఉన్నత స్థాయి సైనిక అధికారుల నుంచి కింద స్థాయి సైనికుల వరకు సెలవులు రద్దు చేశారు . మొత్తం సైనిక సంపత్తి సామాగ్రి ఆయుధాలను మొహరిస్తున్నారు. అగ్ర దేశాలకు జరిగిన దారుణాన్ని వివరిస్తున్నారు. విదేశాల్లోని రాయబారులకు భారతదేశంలో జరిగిన ఉగ్రవాద దాడిని వివరించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది .
అమెరికా ,బ్రిటన్, యూరోపియన్ దేశాలు, ఇటలీ , జపాన్, చైనా ,రష్యా, జర్మనీ ఫ్రాన్స్ తదితర దేశాల్లోని రాయబారులకు ఆయా దేశాల విదేశాంగ శాఖలకు , కాశ్మీర్ పరిస్థితులను వివరించాలని ఆదేశించింది. దీన్ని బట్టి యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయన్నది స్పష్టం. మొదటగా పాకిస్తాన్, పీఓకే లోని తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేసే దిశగా విమాన దాడులు చేస్తారని తెలుస్తోంది. ఆ తరువాత పీఓకే ని స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు పడతాయంటున్నారు.ఇప్పుడు సైన్యం ఏ క్షణంలో దాడికి అయినా సిద్ధం అయిపొయింది.

