వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ అధిష్టానం క్రమశిక్షణ చర్య తీసుకుంది. ఆయనను పార్టీనుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది . అయితే దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినట్టు ఇప్పుడు వైసిపి నాయకత్వం దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారన్నది రాజకీయ వర్గాల్లో చర్చ .. తన కుటుంబాన్ని విడిచి భార్య బిడ్డలతో గొడవపడి వీదికిఎక్కి బ్రష్టుపట్టిన సమయంలో కూడా ఆయన గురించి వైసిపి పట్టించుకోలేదు.ఆ తర్వాత తన ప్రియురాలు మాధురితో కలిసి యూట్యూబ్ లోనూ, టీవీ చానల్స్ లోనూ డ్యాన్సులు వేసిన రోజూ పట్టించుకోలేదు. దేవాలయాలు చుట్టూ చెట్టాపట్టాలేసుకొని తిరిగి డ్యూయెట్లు పాడినప్పుడు పట్టించుకోలేదు.. ఇద్దరూ కలిసి డాన్స్ లేసినప్పుడూ, వంటల ప్రోగ్రామ్స్ చేసినప్పుడు నాయకత్వం అసలు ఏమీ తెలియనట్టే ఉండిపోయారు.
ఇలా దువ్వాడ శ్రీనివాస్ మాధురిల వ్యవహారం రాష్ట్రంలో ఒక సంచలనంగా మారి జనం ఏవగింపునకు, మీడియాలో ట్రోల్ల్స్ కి కారణమైన రోజుల్లో పట్టించుకోలేదు. రకరకాల వేషభాషలతో పబ్లిక్ గానే కౌగిలింతలు, గిలిగింతలు పాటలు డాన్సులు.. ఇద్దరి ప్రేమాయణం ఇలా సాగిపోతున్నప్పటికీ వైసిపి పట్టించుకోలేదు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ , మాధురి సంబంధాన్ని జనం ఎంజాయ్ చేస్తూ అలవాటుపడిపోయిన తరుణంలో దువ్వాడ శ్రీనివాస్ ని పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించారు అన్న దాని వెనక ఓ ఆసక్తికరమైన నిజం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
రాష్ట్రంలో గత వైసీపీ పాలనలో మద్యం విధానంలో జరిగిన ముడుపుల కుంభకోణం మొత్తం బట్టబయలు కావడం ,ఈ కుంభకోణానికి కీలక పాత్రధారిగా వ్యవహరించిన రాజ్ కేసి రెడ్డి అరెస్ట్ కావడం, దీంతో ఈ కుంభకోణం మొత్తం గుట్టు రట్టు కావడంతో దాని నుంచి జనం దృష్టి మళ్లించి మద్యం చర్చను పక్కదారి పట్టించేందుకు హాట్ సబ్జెక్టుగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ మాధురి ల వ్యవహారంపై దృష్టి పెట్టి సస్పెండ్ చేసిందని చెప్తున్నారు . కేవలం మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని పక్కకు మళ్లించేందుకు ఈ పని చేశారని వైసీపీ వర్గాలే గుసగుసలాడుతున్నాయి..

