సినిమా ఫీల్డ్, టివి ఫీల్డ్ అంటేనే రోత రాజకీయాల రొచ్చుగుంట. ఉన్నోళ్లకు పెద్ద టాలెంట్ ఉండదు.. కొత్తోళ్లు వస్తే కుట్రలు, కుతంత్రాలు చేసి తొక్కేస్తారు. పక్కకు తోసేస్తారు. ఈ రెండు రంగాలమీద ప్రజలకు మంచి అబిప్రాయంలేదు.. గతంలో మాదిరి ఘంటసాలలో , ఎస్పీ బాలు, సుశీల లాంటివాళ్ళో ఇప్పుడు లేరు. తాలుతరకల్లాంటి వాళ్ళతోనే ప్రోగ్రామ్స్ గడిచిపోతున్నాయి. గ్రాఫిక్స్ తో సినిమాలు ఆడించేస్తున్నారు. వారం రోజులు సినిమా ఆడితే సూపర్ సక్సెస్ అన్నమాట.. ఇదీ నేటి పరిస్థితి..
బూతుపురాణాలతో టివి ప్రోగ్రామ్స్ చేస్తే వాళ్ళు సూపర్ , డూపర్ నటులకింద లెక్క.. ఇదీ నేటి ఎంటర్ టైన్మెంట్ రంగం దుస్థితి.. ఈ పరిస్థితుల్లో చీకట్లో చిరుదీపంలాగా పాడుతా తియ్యగా ప్రోగ్రామ్ వచ్చింది. జనరంజకంగా సాగింది. అయితే ఇప్పుడు అది మసకబడింది. బాగా పాడే అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నా , వారిని కించపరిచి లేదా అవమానపరిచి పంపిస్తున్నారట . ఇదంతా కొందరు జడ్జీలు చేసే పనేనని చెబుతున్నారు. సిఫార్సులు, కులం ప్రాతిపదికన కూడా జడ్జీలు వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.
మొత్తంమీద మీద ప్రతిభగలవారు ఉంటె మాత్రం వెనక్కి నెట్టేస్తున్నారట.. భవిష్యత్తులో తమకు అడ్డంకి కాకూడదని ఇలా చేస్తున్నారని సింగర్ ప్రవస్తి మాటల్లో స్పష్టమైంది. సీనియర్ సింగర్ సునీత, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి లపై ఆ అమ్మాయి తీవ్రమైన ఆరోపణ చేసింది. దీంతో వీళ్ళింత నీచులా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి వారితో పాడుతాతీయ్యగా లాంటి ప్రోగ్రామ్స్ గబ్బుపట్టిపోతాయి అని ఆందోళన వ్యక్తమైంది. మెజారిటీ అభిప్రాయం ప్రవస్తి కె అనుకూలంగా ఉంది. ప్రవస్తి వీళ్ళ నేచ్ఛత్వాన్ని గురించి చెప్పిన వీడియోలు ఇప్పుడు ట్రేండింగ్ లో ఉన్నాయి.

