వక్ఫ్ బిల్లు మీద దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న తరుణంలో ముంబైలోని అంబానీల ఇల్లు ఉన్న స్థలం ఎవరిది అన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముంబైలో 27 అంతస్తుల అని అంబానీల భవనం వక్ఫ్ బోర్డు స్థలంలో కట్టిందని తేలింది. అయితే ఈ స్థలాన్ని వక్ఫ్ బోర్డు పెద్దలే అంబానీలు అమ్మేశారు. ,అర్కెట్ విలువకంటే తక్కువకే అమ్మినా , లావాదేవీలన్నీ చట్టప్రకారమే జరిగాయి. అయితే ఈ స్థలాన్ని ఇచ్చిన డాటా ఉద్దేశానికి బిన్నంగా దీన్ని వక్ఫ్ బోర్డు ప్రయివేట్ వ్యక్తులకు అమ్మవచ్చాలేదా అన్నది న్యాయపరమైన వివాదం. ఈ భవనం ఉన్న ఒక ఎకరం 12 సెంట్ల స్థలంలో 1895 లో కరీం భాయ్ అనే ఒక కోటీశ్వరుడు వృద్దులకు అనాధ ఆశ్రమం కట్టించి వక్ఫ్ బోర్డుకి ఇచ్చారు .
ఆ కాలంలో కరీం బాయ్ పెద్ద నౌకా వ్యాపారి . విదేశాలకు ,విదేశీ సంస్థలకు ,అనేక కంపెనీలకు వ్యక్తిగతంగా అప్పులు ఇచ్చే అపరకుబేరుడు . ఇప్పటికీ కరీం భాయ్ నౌకాశ్రయం చరిత్రలో ఒక సువర్ణ ఘట్టం. ఆయన వారసులు కూడా ఇప్పుడు విదేశాల్లో స్థిరపడిపోయారు ..అంబానీలు తమ ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఈ స్థలాన్ని వక్ఫ్ బోర్డ్ నుంచి కొనుగోలు చేశారని రికార్డులు ఉన్నాయి . అయితే అప్పట్లో మార్కెట్ ధర కంటే దీన్ని తక్కువకి కొనుగోలు చేశారట. కానీ జరిగిన స్థలం అమ్మకం , కొనుగోలు లావాదేవీ మాత్రం అధికారికంగానే జరిగింది . అప్పటి వక్ఫ్ బోర్డ్ పెద్దలు లేదా అక్కడ ఉన్న నేతలు ఇంత తక్కువ ధరకు అంబానీలకు ఈ స్థలం ఎందుకు ఇచ్చారు అన్నది వారికి తెలియాలి .

