ఓ తల్లి చేసిన పని మాతృత్వానికి తలవంపులు తెచ్చేది .. అలాగే ఆ తల్లి చేసిన తప్పును సరిదిద్ధిన ఓ హిజ్రా తీసుకున్న బాధ్యతను జనం పొగుడుతున్నారు.. సమాజం చిన్న చూపు చూసే హిజ్రాలకు మనసు ,మాతృత్వమమకారం ఉంటుందని నిరూపించే సంఘటన ఇది. సంతాన భాగ్యం లేకపోయినా మాతృత్వంలో మమకారం వాళ్లకి సొంతమని నిరూపించే సంఘటన ఇది. ఢిల్లీలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో తల్లి , ఆడబిడ్డ పుట్టిందని ఆ బిడ్డను వదిలేసి రాత్రికి రాత్రి పారిపోయింది . దీంతో హాస్పిటల్లో కలకలం చెలరేగింది. ఆ తల్లి ఇచ్చిన అడ్రెస్ కూడా తప్పుడుదే. ఈ వార్త తెలియడంతో చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ బిడ్డను చూసేందుకు వచ్చారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సునీత శర్మ అని ఓ హిజ్రా బిడ్డ కోసం అల్లాడిపోయింది.
హాస్పిటల్లోనే ఉంటూ ఆ బిడ్డ బాగోగులు కొంతకాలం పాటు చూసుకుంది. ఆ బిడ్డను తనకు దత్త తీస్తే పెంచుకుంటానంటూ అధికారులు చుట్టూ తిరిగి ఎట్టకేలకు బిడ్డను దత్తత తీసుకుంది. అధికారులు కూడా హిజ్రా వ్యక్తిత్వాన్ని ,వ్యక్తిగత జీవితాన్ని ,ఆమె ఆస్తిపాస్తులు వీటన్నిటిని చూసి బిడ్డను పోషించుకుననే తాహతు ఉందని నిర్దారించుకుని ఆ బిడ్డను దత్తత ఇచ్చింది . ఆడపిల్ల జీవితానికి వరమని , తల్లికి భాగ్యలక్ష్మి లాంటిదని సునీత శర్మ సంతోషం వ్యక్తం చేశారు . మాతృత్వం మమకారంతో తల్లిని కావాలని అనుకున్నప్పటికీ వీలుకాదని , అయితే జీవితంలో భగవంతుడు ఇలా ఈ బిడ్డ రూపంలో తనను తల్లిని చేశాడని ఆనందంతో మురిసిపోయింది .

