పశ్చిమ బెంగాల్ బిజెపి మాజీ అధ్యక్షుడు సీనియర్ బిజెపి నేత దిలీప్ ఘోష్ లేటు వయసులో ఘాటు ప్రేమ వార్తల్లోకెక్కింది.. 60 ఏళ్ల దిలీప్ ఘోష్ కొత్త పెళ్ళికొడుకు అయ్యాడు . రింకు మజుందార్ అనే మహిళను వివాహం ఆడాడు . దిలీప్ ఘోష్ కి ఇంతవరకు పెళ్లి కాలేదు. ఆయన బ్రహ్మచారిగానే ఉన్నాడు , అయితే 60 ఏళ్ళు దాటిన తరువాత పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కలిగిందని అన్నారు. ఇది తన తల్లి కోరిక అని చెప్పారు. ఇంతకుమించి తానేమీ చెప్పలేనని స్పష్టం చేసారు. ఆరెస్సెస్ సంస్థలో కూడా ఆయన కీలకంగా పనిచేసారు.
దిలీప్ ఘోష్ పెళ్లాడిన రింకు మజుందార్ కి ఇదివరకే పెళ్లయింది. ఆమెకు 51 ఏళ్ళు.. ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఈ వివాహం తన రాజకీయజీవితంపై ఎలాంటి ప్రభావం చూపదని అన్నారు. వీరిద్దరి పరిచయం 2021లో కలకత్తా ఎకో పార్క్ లో వాకింగ్ చేస్తున్నప్పుడు మొదలై , ప్రేమాయణానికి , తరువాత ఐపీఎల్ మ్యాచ్ సమయంలో పెళ్ళి చేసుకోవాలన్న నిర్ణయానికి దారితీసింది. పెళ్లి ప్రతిపాదన , ఆమెనుంచే మొదలైంది. అడిగినవెంటనే దిలీప్ ఘోష్ అంగీకరించడంతో సంతోషం కలిగిందని రింకు చెప్పింది. తమ హనీమూన్ దేశంలోనే ఒక ప్రాంతంలో ఉంటుందని చెప్పారు.

