ప్రియుడితో కలిసి భర్తను అంతం చేసిన భార్య అద్భుతమైన నాటకం ఆడింది. సినిమా స్టైల్లో కదా అల్లింది. అయితే పోస్ట్ మార్టం లో అంటా తిరగబడి నేరం రుజువుకావడంతో చేసిన దారుణం ఒప్పేసుకుంది. మీరట్ లో రవిత మహిళ తన భర్త అమిత్ పాముకాటుతో చనిపోయాడని గగ్గోలు పెట్టేసింది. పాముకూడా అమిత్ కిందనే ఉండింది. చేతిపైన పదిచోట్ల పాముకాటు అని నమ్మించేందుకు గాట్లు పెట్టింది. నిద్రపోతున్నప్పుడు పాము వచ్చి కాటేసిందని నమ్మించింది. అయితే పోస్ట్ మార్టంలో అసలు సంగతి బయటపడింది. అమిత్ శరీరంలో విషం ఛాయలు లేవని , అతడు గొంతు నులమడంవల్ల ఊపిరాడక చనిపోయాడని డాక్టర్లు తేల్చారు.
దీంతో పోలీసులు ఆమెను నిలదీయడంతో అసలు సంగతి బయటపడింది. తనకు గత ఏడాది కాలంగా అమర్ జిత్ అనే యువకుడితో అక్రమసంబంధం ఉందని చెప్పింది. ఈ విషయం భర్తకు తెలియడంతో గొడవలు మొదలయ్యాయని , అందువల్ల అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి భర్తను అంతం చేసానని చెప్పింది. వెయ్యి రూపాయలకు ఈ పామును కొని తెచ్చానని తెలిపింది. భర్తను, ప్రియుడితో గొంతు పిసికి అంతం చేసాక , పాముని కూడా చంపేసి , మంచమీదనే వేశానని ఒప్పుకుంది..

