ప్రపంచంలో అమ్మకంచేసే ప్రతి ఐదు యాపిల్ మొబైల్ ఫోన్లలో ఒకటి భారతదేశంలోనే తయారైనది. చైనా లో విధానాలు, ఎలక్ట్రానిక్స్ రంగాలకు మన ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలతో ఈ ఏడాది మనదేశం నుంచి యాపిల్ కంపెనీ ఒక లక్ష 75 వేలకోట్లు విలువజేసే ఐ ఫోన్లను ఉతపట్టి చేసి ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లోకి పంపింది. మనదేశంలో యాపిల్ ఉత్పత్తుల్లో ఇది గత ఏడాది కంటే 60 శాతం ఎక్కువగా ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠినమైన ఆర్థిక విధానాలనుంచి మొబైల్ ఫోన్లు మినహాయించడంతో దీని ప్రభావం యాపిల్ పై పడలేదు.
ఒక వ్యుహంప్రకారం చైనా నుంచి యాపిల్ ఫోన్ల ఉత్పత్తులను క్రమంగా తగ్గించాలని చేస్తున్న ప్రయత్నాలు , భరత్ కు అనుకూలంగా మారాయి. చైనా బెదిరింపులు కూడా ఒకరకంగా యాపిల్ ఫోన్ల హబ్ గా భారత ని మార్చాలన్న ఆ కంపెనీ నిర్ణయానికి కారణం కావచ్చునని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. భారత్ యాపిల్ ఫోన్లకు 8 శాతం మార్కెట్ ఉంది. ఎనిమిది బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది. ఇది మరో రెండేళ్లలో మూడింతలు కావచ్చునని యాపిల్ మార్కెటింగ్ నిపుణుల అంచనా..

