అతడు ఆబ్సెంట్ మైండ్ పోలీస్ అధికారి.. అతను చేసిన పని ఏమిటో తెలిస్తే ఇలాంటి వాళ్ళు కూడా పోలీస్ శాఖలో ఉన్నారా అని ముక్కున వేలేసుకోక తప్పదు.. ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ఒక దొంగతనం కేసులో కోర్టుకు రాకుండా తప్పించుకు తిరుగుతున్న దొంగకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది .నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచాలని ఫిరోజాబాద్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు . అయితే ఈ పోలీస్ అధికారి మాత్రం ఆ వారెంట్ లో దొంగ పేరు బదులు జడ్జి పేరు రాసేసాడు .వారెంట్ లో దొంగ పేరు రాజ్ కుమార్ బదులు జడ్జి పేరు నగ్మాఖాన్ అని పడింది.
ఎస్ ఐ మాత్రం దొంగ పేరు స్థానంలో జడ్జిపేరు ఉన్న వారెంట్ పట్టుకొని తిరుగుతున్నాడు .. ఆ ప్రాంతంలో వారు నగ్మాఖాన్ పేరుతో ఇక్కడ ఎవరు లేరు అని చెప్పడంతో కోర్టుకు వచ్చి ఆ దొంగ కనిపించడం లేదని పరార్ లో ఉన్నాడంటూ కోర్టుకు విన్నవించుకున్నాడు. వారెంట్ కూడా చూపించాడు. అయితే జడ్జి ఆ వారెంట్ చూసి షాక్ తిన్నారు . వారెంట్ లో దొంగ రాజ్ కుమార్ పేరు బదులు తన పేరు ఎందుకు ఉందని అడిగితే ఎస్ఐ పొరపాటు జరిగిందని చెంపలేసుకున్నాడు. దీంతో జడ్జి అతని మందలించి అతడిపై చర్య తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులకు ఆదేశాల జారీ చేశారు.

