కొడుకుని అమెరికాలో చదివించాలని ఉన్నదంతా అమ్మి పెట్టుబడి పెట్టారు.. కొడుకు అమెరికాలో చదివి, అక్కడే ఉద్యగం వెలగబెట్టి , జల్సాలో వెలిగిపోతున్నాడు.. ఇక్కడేమో తల్లితండ్రులు పస్తులతో అల్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కొడుకా.. ఆకలిరా అంటున్నా వాడేమో పట్టించుకోవడంలేదని కోర్టులు, పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. కోర్టు నెలకు 10 వేల రూపాయలు ఇవ్వాలని కొడుక్కి ఆదేశాలుపంపినా , వాడేమో పట్టించుకోవడంలేదని , తినేందుకు తిండిలేక కడుపులు మాడ్చుకుంటున్నామని ఆ పేద తల్లితండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
రక్తకన్నీరు సినిమాలో నాగభూషణం స్టైల్లో కొడుకేమో అమెరికాలో కులుకుతున్నాడు. పల్నాడు జిల్లా, మాచర్ల మండలం విజయపురిసౌత్‌కు చెందిన బ్రహ్మారెడ్డి, విజయలక్ష్మి దంపతుల కొడుకే అంజిరెడ్డి. కుటుంబానికున్న ఎనిమిదిన్నర ఎకరాల భూమితోపాటు ఇల్లుకూడా అమ్మి కుమారుడిని ఇంజనీరింగ్ చదివించారు. చదువు అనంతరం అతను అమెరికాకి పపంపారు.అక్కడ అతడు సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా స్థిరపడ్డాడు. ఆ తర్వాత వృద్ధులైన దంపతులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. ఇక్కడేమో వీరు ఆకలి, అనారోగ్యంతో అల్లాడిపోతున్నారు.
అనారోగ్యంతోపాటు ఆర్థిక పరిస్థితి దిగజారడంతో దుర్భర జీవనం గడపలేక ఆ తల్లిదండ్రులు గతంలో జీవితం చాలించే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆ వృద్ధ తల్లితండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. .మాచర్ల పర్యటనకు వచ్చిన ఎస్పీ ఆ వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లారు. వారితో మాట్లాడి న్యాయం చేస్తానని మరోసారి హామీ ఇచ్చారు. ఎస్పీ వెంట తహసీల్దారు కిరణ్‌కుమార్, రూరల్ సీఐ నఫీజ్ బాషా, ఎస్సై మహమ్మద్ షఫీ తదితరులు ఉన్నారు.

