మాజీఎంపీ, వైసిపి నేత గోరంట్ల మాధవ్ కేసులో కొంత మంది పోలీస్ అధికారులపై వేటు పడే అవకాశముందని చెబుతున్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న టిడిపి బహిష్కృత సోషల్ మీడియా యాక్టివిస్ట్ కిరణ్ పై దాడి సంబందించిన ఘటనలో పోలీసుల పాత్రపై అనుమానాలున్నాయి. కిరణ్ ని పోలీసులు తీసుకుపోయే రూట్ మ్యాప్ , గోరంట్ల మాధవ్ కి ఎలా తెలిసిందన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిపై దాడి జరగడం కూడా తీవ్రమైన నేరమే..
దానికితోడు ఈ కేసులో మాధవ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు , ఇతర నిందితులతో పాటు అతడిని ముసుగేసి మీడియా ముందుకు ఎందుకు తీసుకురాకుండా , గడిలోపెట్టి రాచమర్యాదలు చేసారో తేలాల్సివుంది. ఈ అంశంపై విచారణ జరిపిన పోలీస్ అధికారులు, కొంతమందిని గుర్తించి చర్యలకు సిఫార్సు చేసారని చెబుతున్నారు. పోలీస్ శాఖలో వైసిపి కోవర్టులు ఉన్నారని టిడిపి నేతలే నెత్తి , నోరు బాదుకుంటున్నారు. ప్రస్తుతం మాధవ్ కేసులో వేటు పడే వారిలో సిఐ, ఎసై స్థాయి అధికారులున్నారని చెబుతున్నారు..

