తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఎంతో నిష్ఠగా ఉంటారు. సాంప్రదాయాలు, పద్ధతులు కచ్చితంగా పాటిస్తుంటారు. ఒకవేళ ఏదైనా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే.. టీటీడీ సిబ్బంది వెంటనే అలెర్ట్ అయిపోతారు. చేసిన తప్పుని సరిదిద్దుకుంటూ ఉంటారు. కానీ తాజాగా తిరుమలలో సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. శ్రీనివాసుని దర్శనానికి వచ్చిన ముగ్గురు భక్తులు.. చెప్పులు ధరించి రావడం చర్చేనీయాంశమైంది.
ఆ ముగ్గురు భక్తులు తెల్లని చెప్పులతో ప్రధాన ద్వారం వరకూ వచ్చేశారు. టీటీడీ సిబ్బంది ఎవరూ కనీసం గుర్తించకపోవడం చూస్తుంటే.. విధుల్లో వారు ఎంత నిర్లక్ష్యం ప్రవర్తిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. చెప్పులు వేసుకొని ఆలయంలోకి వెళ్తున్న వారిని.. శ్రీవారి సేవకులు కొందరు గుర్తించి.. ఆపేశారు. చెప్పులు విడిచి వెళ్లాలంటూ అడ్డుకున్నారు. చివరికి ఆ ముగ్గురు భక్తులు చెప్పులు విడిచి.. స్వామివారి దర్శనానికి వెళ్లారు.

