గర్ల్ ఫ్రెండ్ ని సూట్ కేస్ లో ఉంచి , తన హాస్టల్ రూమ్ లోకి తీసుకుపోతున్న విద్యార్థిని సెక్యూరిటీ అడ్డుకునింది. స్టూడెంట్ లవర్ కంగారులో సూట్ కేస్ నుంచి అమ్మాయిని బయటకు తీశారు. హర్యానాలోని సోనేపట్ యూనివర్సిటీలో , ఓ పిజి స్టూడెంట్ బరువైన సూట్ కేస్ ని ట్రాలీ తో తీసుకొస్తున్నాడు. అయితే సెక్యూరిటీ అడ్డుకొని సూట్ కేస్ ఓపెన్ చేయమని అడిగింది. స్టూడెంట్ లవర్ వారిస్తున్నా , సెక్యూరిటీ , సూట్ కేస్ ఓపెన్ చేయించింది.
ఆ వెంటనే సూట్ కేస్ లో నుంచి ప్రియురాలు బయటకొచ్చింది. దీంతో అందరూ షాక్ కి గురయ్యారు. ఈ లవర్ బోయ్ , రూమ్ లో ఒక్కడుగానే ఉంటున్నాడు. అప్పుడప్పుడు ఇలా చేస్తున్నాడా అన్న అనుమానంకూడా వస్తోంది. మొత్తం మీద ఈ సినీ ఫక్కీ లవర్ ఇన్ సూట్ కేస్ ఉదంతంతో ఈ గుట్టు రట్టయింది. ఈ ఉదంతం మొత్తం వీడియో కూడా తీసి సోషల్ మీడియాలో పెట్టారు. యూనివర్సిటీ అధికారులు విచారణ చేస్తున్నారు.

