జగన్ , జాగ్రత్తగా మాట్లాడు.. మా పోలీస్ యూనిఫారం ఊడదీస్తావా , మమ్మల్ని బట్టలు ఊడదీసి కొడతావా ..? నువ్వొచ్చి బట్టలు ఊడదీస్తానంటే , ఇది అరటి తొక్కకాదు.. జగన్.. జాగ్రత్తగా మాట్లాడు.. మేము నిజాయితగా పనిచేస్తాం, నీతికోసం చస్తాం.. అంతే కానీ నీలాంటోడు బట్టలు ఊడదీస్తానంటే , మేము చేతకానివాళ్ళం కాదు.. జాగ్రత్తగా మాట్లాడు.. అంటూ రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ చేసిన హెచ్చరిక సంచలనం అయింది. ఇది కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగం.. అది గుర్తు పెట్టుకో.. అంటూ ఒక ఎస్సై స్థాయి అధికారి , మాజీముఖ్యమంత్రి పై ఇలా విరుచుకుపడటం ఏపీ చరిత్రలో ఇదే ప్రధమం. సాధారణంగా రాజకీయనాయకులు చేసే ఆరోపణలకు పోలీస్ అధికారులు స్పందించరు .. ఏదైనా చెప్పాలనుకుంటే తమవైపు వివరణ ఇస్తారు. అయితే రామగిరి ఎస్సై మాత్రం సినిమా స్టైల్లో జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీసులను బట్టలూడదీసి కొడతానని జగన్ అన్న మాటలపై అంతకంటే ఘాటుగా ఎస్సై స్పందించారు..

