పాస్టర్ ప్రవీణ్ పగడాలని హత్య చేశారని సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెన్ని లింగం మీకు గుర్తున్నాడా..? గత వారం రోజుల క్రితం ఈయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే లేపాయి. రెండు మతాల మధ్యన అగ్గి రాజేసేందుకు బెన్నిలింగం ప్రయత్నించారు. ప్రవీణ్ మరణాన్ని అడ్డుపెట్టుకొని.. క్రైస్తవులను రెచ్చగొట్టేందుకు బెన్నిలింగం తీవ్రంగా ప్రయత్నించారు. బైబిల్ పక్కనపెడితే ఒక్కొక్కరినీ ఊచకోత కోస్తామంటూ మీడియా ముందే మాట్లాడారు. మమ్మల్ని గెలకొద్దు.. మూర్ఖులం మేమంతా.. అంటూ రెచ్చిపోయారు. మాతో పెట్టుకోవద్దు అంటూ పబ్లిక్ గా మాట్లాడారు. దీంతో బెన్నిలింగంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో పోలీసులు కూడా బెన్నిలింగం బెండు తీయాలని డిసైడ్ చేసుకొని.. కేసు నమోదు చేసి.. విచారణకు పిలిచారు.
రాజానగరం పోలీసు స్టేషన్ కు తీసుకొచ్చి విచారించారు. అయితే మీడియా ముందు రెచ్చిపోయిన బెన్నిలింగం.. పోలీసు విచారంలో మాత్రం పిల్లిలా మారిపోయాడట.. సార్.. సార్.. ఏదో జనాల్ని చూసి ఆవేశంలో రెచ్చిపోయానని అన్నాడట.. మతవిద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశం లేదని రాతపూర్వకంగా చెప్పాడట.. ప్రవీణ్ ను హత్య చేశారని అనడానికి తనవద్ద ఆధారాలు లేవని కూడా చెప్పేశాడట.. దీంతో నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్.. ఇకపై ఇలాంటి పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి విడిచిపెట్టినట్టు సమాచారం. అయితే ప్రవీణ్ మృతి కేసులో అవసరమైతే ఎప్పుడైనా విచారణకు రావాలని కూడా బెన్నిలింగానికి పోలీసులు తెలిపినటు చెబుతున్నారు. మొత్తానికి నోటిదూలతో.. రాజకీయ కారణాలతో ఇలాంటి పిచ్చిమాటలు మాట్లాడేవారికి పోలీసులు మరింత గట్టిగా కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది.

