విమానాల్లో చోరీలు.. ఇదేందబ్బా అని ఏంచేద్దాం..? అదంతే , గతంలో రైళ్లు, బస్సుల్లో పిక్ పాకెట్ కొట్టేవాళ్ళు.. ఇప్పుడూ అక్కడక్కడా జరుగుతుంటాయి.. అయితే విమానాల్లో దొంగతనాలే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్.. మంగుళూరు నుంచి బెంగుళూరుకి వస్తున్నా ఇండిగో విమానంలో ఓ పాప మెడలోఉన్న రెండులక్షలరూపాయల విలువజేసే బంగారు చైన్ కొట్టేశారు.. ప్రియాంక ముఖర్జీ అనే మహిళ తన ఇద్దరు బిడ్డలతో విమానంలో వస్తోంది. మూడేళ్ళ బిడ్డ బాగా అల్లరి చేస్తుండటంతో, ఐదేళ్ల కూతురిని చూస్తుండమని ఫ్లయిట్ అటెండెంట్ దగ్గర వదిలిపెట్టింది.
విమానం బెంగుళూరుకి చేరుకున్న తరువాత , ఆమె విమానం దిగబోతుండగా కూతురు చైన్ కనపడలేదు. ఈ విషయం అప్పటివరకు పాపను చూసుకున్న ఫ్లయిట్ అటెండెంట్ ని అడిగితే , మే తనకు తెలియదని చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు , ఎయిర్ పోర్ట్ అధికారులకు, ఇండిగో అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే తన ఫిర్యాదుకు తగిన స్పందన లేదని ఆమె చెబుతొంది. విదేశీ విమానాల్లో కూడా ఇలా పాసెంజర్ల డబ్బులు, విలువైన వస్తువులు పోయినట్టు ఫిర్యాదులు ఉన్నాయి..

