హైదరాబాద్ ఇన్ కమ్ ట్యాక్స్ శాఖలో ఇంటి దొంగలను పట్టేసారు. ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసు, ఇతర వ్యవహారాల్లో రహస్యాలను ఇతరులకు చేరవేస్తూ ఈ అధికారులు చిక్కిపోయారు. వీరి కార్యకలాపాలపై రహస్యంగా అందిన సంచారంతో కొంతకాలంగా సిబిఐ నిఘా వేసి ఉంచింది. ఆఫీసులో కీలక సమాచారాన్ని , ఫైల్స్, కంప్యూటర్లనుంచి సేకరించి చేరవేస్తున్నారు. ఇందుకుగాను వీరికి పెద్ద మొత్తంలో డబ్బు ముడుతున్నట్టు సమాచారం ఉంది. దీంతో ఒక్క సారిగా ఈ గూఢచర్యం చేస్తున్న ఇన్ కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ రవూఫ్, కె.శ్రీనివాస్ , ఖుమార్ ఆలం, జావేద్, మనీష్ అనే ఉద్యోగులను సిబిఐ అరెస్ట్ చేసి విచారణకు తీసుకుపోయింది. వీరితో పాటు చార్టెడ్ అకౌంటెంట్ పులిమామిడి భగత్ పై కూడా కేసు నమోదు చేసింది.

