22.5 C
New York
Monday, April 6, 2026

Latest Posts

ఐదేళ్ల క్రితం కేసులో అనంతపురంకు బోరుగడ్డ.

వైసిపి రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ ని పాతకేసులు పాపాల్లా వెంటాడుతున్నాయి. ఐదేళ్ల వైసిపి పాలనలో ఆయనపై పాత కేసులు విచారించే దమ్ము పోలీసులకు లేకుండాపోయింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో బోరుగడ్డ జాతకం తిరగబడింది. పాత కేసులు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. దీంతో జైలు నుంచి ఎప్పుడు బయటకొస్తాడో తెలియని పరిస్థితి. తాజాగా బోరుగడ్దని రాజమండ్రి సెంట్రల్ జైలునుంచి అనంతపురంకు తరలించారు. 2018 లో అనంతపురం రామచంద్రపురంలో చర్చి సభ్యులు; రెండుగా విడిపోయారు. హుండీ లెక్కింపు, ఇతర ఆస్తుల విషయంలో నేపథ్యంలో వారిమధ్య గొడవలు జరిగాయి.

ఇందులో ఒక వర్గం బోరుగడ్డ అనిల్ ని ఆశ్రయించింది. 2018, జూలై నెలలో చర్చి హుండీ లెక్కించారు. పోలీసులు చర్చి సభ్యుల కోరికమేరకు భద్రతా చర్యలు చేపట్టారు. ఆ సమయంలో బోరుగడ్డ అనిల్ , పోలీసు అధికారులకు ఫోన్ చేసి, తనను ఐఏఎస్ అధికారి రాజశేఖర్ గా చెప్పుకొని , దుర్బాషలాడాడు. తిమోతీ వర్గానికే సపోర్ట్ చెయ్యాలని ఆదేశించాడు. ఆ తరువాత పోలీసుల విచారణలో అది ఫేక్ కాల్ అని తేలింది. బోరుగడ్డ అనిల్ , ఐఏఎస్ అధికారిపేరుతో ఫోన్ చేసి , తమను తిట్టాడని, పోలీస్ స్టేషన్లో కేసుపెట్టారు. అయితే వైసిపి పాలనలో ఈ కేసు విషయంలో చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు జాతకాలు తిరగబడటంతో , బోరుగడ్డని ఆ కేసు విచారణకు అనంతపురం కోర్టుకి తీసుకొచ్చారు..

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.