తిరుమలలో కోటి రూపాయలు విరాళం చెల్లించే భక్తులకు టిటిడి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. ఈ సౌకర్యాలు ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజులలో మినహా మిగిలిన రోజులలో విరాళం ఇచ్చిన భక్తులు తమకు కల్పించిన ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవచ్చు.. కోటి విరాళం ఇచ్చే దాతలకు జీవితకాలంలో దాతతో పాటు నలుగురికి ప్రతి ఏడాది క్రింది సౌకర్యాలను టిటిడి కల్పిస్తోంది. కోటి రూపాయలు విరాళం ఇచ్చిన భక్తులు సంవత్సరంలో మూడు రోజులు సుప్రభాత సేవ వినియోగించుకోవచ్చు, మరో మూడు రోజులు స్వామివారి బ్రేక్ దర్శనం అందుబాటులో ఉంటుంది.
ఇదికాక నాలుగు దినాలు సుపథం ద్వారా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. వీటితోపాటు పది పెద్ద లడ్డూలు, 20 చిన్న లడ్డూలు, ఒక దుప్పట ,ఒక రవిక, మహా ప్రసాదం ప్యాకెట్లు పది , ఒక సారి వేద ఆశీర్వచనం వంటి సౌకర్యాలను పొందవచ్చు ., వీటితో పాటుగా వసతి గదుల సదుపాయం మూడు రోజులు కల్పిస్తారు.అంతేకాక జీవిత కాలంలో ఒకసారి దాతకు ఐదుగ్రాముల శ్రీవారి బంగారు డాలర్ మరియు ఒక 50 గ్రాముల సిల్వర్ డాలర్ ను అందజేస్తారు.

