రిజర్వ్ బ్యాంక్ , బ్యాంకు కస్టమర్లకు భారీగానే షాక్ ఇచ్చింది. ఏటీఎం విత్ డ్రాల్స్ రుసుములు పెంచేసింది.. ఒకే దఫా ఏటీఎం ఫీజిలను రెండు రూపాయలనుంచి 23 రూపాయలకు , బ్యాలెన్స్ చెకింగ్ ఫీజు రూపాయి నుంచి ఏడు రూపాయలకు పెంచేసింది. ఇంత భారీ స్థాయిలో ఏటీఎం ఫీజులు పెంచడం చరిత్రలో ఇదే ప్రధమం.పరిమితికి మించి విత్ డ్రాల్స్ చేస్తే ఈ చార్జీలు వర్తిస్తాయి. ఇటీవల కాలంలో ఏటీఎం లావాదేవీల్లో వచ్చే ఆదాయం కూడా బ్యాంకులకు పూర్తిగా తగ్గిపోయింది.. ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే 2023 – 24 సంవత్సరానికి ఏటీఎం ద్వారా ఆదాయాన్ని సంపాదించుకుంది.
గత ఏడాదికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఏటీఎం ద్వారా 331 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది . మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తొమ్మిది బ్యాంకులు కలిపి 3739 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. కేవలం ఏటీఎంలు కారణంగానే గత ఐదేళ్లలో ఈ బ్యాంకులకు అంత నష్టం వాటిల్లింది . గత ఏడాదికి మాత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాకుండా పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 90 కోట్లు కెనరా బ్యాంకుకు 31 కోట్లు ఏటీఎం ద్వారా వచ్చింది . దీనివల్లనే రిజర్వ్ బ్యాంక్ ఏటీఎం చార్జీలు మే ఒకటో తేదీ నుంచి పెంచేసింది..

