22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

పాస్టర్ మృతి, తప్పుడు ప్రచారం, వ్యక్తి అరెస్ట్

ఏపీ , తెలంగాణ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై తప్పుడు ప్రచారం చేసిన , ఇంత గొడవకు కారణమైన దేవాబత్తుల నాగమహేష్ అనే వ్యక్తిని రాజమండ్రి పోలీసులు అరెస్ట్ చేసారు. న్యాయమూర్తి అతనిని రిమాండ్ కి పంపారు. విఆర్వో ఇచ్చిన ఫిర్యాదు ,మేరకు ఈ చర్య తీసుకున్నారు. మోటార్ సైకిల్ ప్రమాదంలో చనిపోయిన మహేష్ మరణంలో కుట్రకోణం ఉందంటూ ప్రచారం చేసి , గొడవలకు, వివిధప్రాంతాల్లో ఉద్రిక్తతలకు కారణమయ్యాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

పాస్టర్ ప్రవీణ్ , హైదరాబాద్ లో బయలుదేరినప్పటినుంచి , ఆయన కదలికలు, బ్రాందీ షాపుల్లో మద్యం కొనుగోళ్లు , బైక్ నడపలేని పరిస్థితిలో రోడ్డుపక్కన ఉండిపోవడం, అంతకుముందే బైక్ ఆక్సిడెంట్ లో హెడ్ లైట్ పగిలిపోవడం.. ఇలాంటివన్నీ ఆధారాలు సేకరించి , ఆయన మరణం ప్రమాదంలో జరిగిందేనని నిర్థారించి ఈ చర్య తీసుకున్నారు. ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేసి అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నం చేసిన మరికొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని , వ్యక్తులను కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. ఈ ప్రచారం వెనుక రాజకీయ దురుద్దేశాలపై కూడా పోలీసులు దృష్టి పెట్టారని తెలిసింది..

 

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.