22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

వీళ్ళు నర్సుల రూపాల్లో దేవతలు

మయన్మార్ ,థాయిలాండ్ తర్వాత చైనా లోని యునాన్ ప్రాంతాన్ని వణికించిన భూకంపంలో ఓ చిన్న పిల్లల హాస్పిటల్ లో కనిపించిన దృశ్యం హృదయ విదారకంగా ఉంది. అంతేకాదు ఆ సమయంలో ఆ చిన్న పిల్లల హాస్పిటల్లో భూప్రకంపనలతో అల్లాడిపోతున్న ఆ వార్డులో ఇద్దరు నర్సుల కృషి ,చిన్న బిడ్డలను కాపాడేందుకు వాళ్ళు చేసిన ప్రయత్నం ,వాళ్ళ చిత్తశుద్ధికి , విధి నిర్వహణలో వారి అంకిత భావానికి చేతులెత్తి దండం పెట్టాల్సిందే.. భూకంపం హాస్పిటల్ ని వణికించిన ఆ సమయంలో ఈ ఇద్దరు నర్సులు పురిటి బిడ్డలను కాపాడేందుకు ఎంతగానో కష్టపడ్డారు. ప్రాణాలకు తెగించి అక్కడే ఉండి బిడ్డలను కాపాడే దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

పురిటి బిడ్డలను ఉంచిన వెంటిలేటర్లు, ఉయ్యాలలు ఇవన్నీ కూడా వణికిపోయి పడిపోయే పరిస్థితుల్లో బిడ్లను కాపాడేందుకు ఆ ఆ నర్సులు పడ్డ తాపత్రయం అంతా , ఇంతా కాదు . ఒక దశలో అయితే ఆ వార్డులో వాటర్ కి సంబంధించిన ఫిల్టర్ పగిలిపోయి కింద నీళ్లు కారుతుంటే ఆ నీళ్లలో బిడ్డలు పడకుండా వాళ్ళు పడ్డ శ్రమ, ఆత్రుత అది మాటల్లో చెప్పనలవి కాదు .. నర్సులంటే దేవతా రూపాలని మాతృ స్వరూపాలని ఈ సంఘటన స్పష్టంగా నిరూపిస్తుంది. ఈ వీడియో పలువురును కన్నీరు పెట్టించడమే కాదు,బిడ్లను కాపాడటంలో ఆ నర్సుల ప్రయత్నానికి త్యాగానికి చేతులెత్తి వారికి దండం పెడుతోంది..

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.