టెక్నాలజీ రోజు రోజుకి మారిపోతుంది, ఒకప్పుడు డబ్బులు విత్ డ్రాల్స్ కోసం బ్యాంకులు ముందు క్యూలు కట్టిన జనం ఆ తర్వాత ఏటీఎంల వద్ద క్యూకట్టారు. ఇప్పుడు ఏటీఎంలు కూడా వెలవెలబోతున్నాయి. ఏటీఎంల ద్వారా వచ్చే ఆదాయం కూడా బ్యాంకులకు పూర్తిగా తగ్గిపోయింది. అయినా ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే 2023 – 24 సంవత్సరానికి ఏటీఎం ద్వారా ఆదాయాన్ని సంపాదించుకుంది. గత ఏడాదికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఏటీఎం ద్వారా 331 కోట్ల రూపాయలు ఆదాయము వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గత ఐదేళ్లలో ఏటీఎం ద్వారా 2043 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది . మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తొమ్మిది బ్యాంకులు కలిపి 3739 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది.
కేవలం ఏటీఎంలు కారణంగానే గత ఐదేళ్లలో ఈ బ్యాంకులకు అంత నష్టం వాటిల్లింది . గత ఏడాదికి మాత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాకుండా పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 90 కోట్లు ,కెనరా బ్యాంకుకు 31 కోట్లు ఏటీఎం ద్వారా వచ్చింది. ఇంతకీ ఏటీఎం ద్వారా బ్యాంకులకు లాభాలు ఎలా వస్తాయి మీకు తెలుసా..? విత్ డ్రాలు ఫీజులు, ,బ్యాలెన్స్ ఎంక్వయిరీ ఫీజులు, మరియు నాన్ కస్టమర్స్ కు అంటే ఆ బ్యాంకు కస్టమర్ కాని వాళ్ళు ఏటీఎంలు వాడితే దాని ద్వారా వచ్చే ఫీజులు ఆ తర్వాత ఇంటర్ చేంజ్ ఫీజులు ఇలా కొన్ని రకాలు మనకు తెలియకుండానే ఏటీఎంలో ఫీజులు రూపంలో బ్యాంకులకు ఆదాయాన్ని తెచ్చి పెడతాయి. అయితే ఇప్పుడు డిజిటల్ పేమెంట్లు ఎక్కువకావడంతో దాదాపు 85 శాతం మంది మొబైల్ ఫోన్లో ద్వారానే పేటీఎం ఫోన్ పే గూగుల్ పే లాంటి విధానాలు లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ తో నగదు బదిలీ చేస్తుండడంతో ఏటీఎంల ఆదాయం తగ్గిపోయింది.

