వైసిపి అధికారంలో ఉండగా మీడియా సమావేశాలు ,సోషల్ మీడియా పోస్టింగుల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులను వారి కుటుంబ మహిళలను తీవ్రంగా దూషించిన సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు. బెయిల్ పై వచ్చిన తర్వాత హైదరాబాదులో ఆయనను ఎవరూ కలవలేదు. సాధారణంగా సినిమా పరిశ్రమలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కొంతమంది స్నేహితులు ,సానుభూతిపరులు సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు పోయి పరామర్శించి ,పలకరించి రావడం ఆనవాయితీ . అయితే జైలు జీవితం అనుభవించి వచ్చిన పోసానిని సినీ పరిశ్రమకు చెందిన ఏ ఒక్కరూ కూడా వెళ్లి పరామర్శించలేదని చెప్తున్నారు.
కనీసం ఫోన్ లో కూడా ఆయనతో మాట్లాడలేదని చెప్తున్నారు . హైదరాబాదులోనే ఉంటున్న కొంతమంది వైసిపి నాయకులు కూడా ఆయనను కలిసేందుకు ఇష్టపడటంలేదు. టిడిపి అధికారంలోకి రావడంతోనే ఇక తాను ఏ వివాదంలో జోక్యం చేసుకోనని, రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పాడు. చేసిన తప్పులు తెలిసుకాబట్టే ఆయన ముందుగా కాళ్లబేరానికి దిగాడు. కనీసం పోసాని బంధువులు ,గతంలో సన్నిహితంగా ఉన్నవారు కూడా ఇప్పుడు ఆయనతో మాట్లాడేందుకు వెనుకాడుతున్నారు . దీంతో ఆయన ఒంటరి వాడైపోయాడు .పోసాని అరెస్టుతో వైసిపి వర్గాల్లోనే సానుభూతి వ్యక్తం కాలేదు . చాలామంది వైసిపి నేతలే ఆయన వ్యాఖ్యలను అసహ్యించుకున్నారు. అందువల్ల పోసానికి మామూలుగానే పార్టీలో కూడా సానుభూతి, ఓదార్పు కూడా కరువైంది.

