22.5 C
New York
Saturday, April 4, 2026

Latest Posts

పోలీస్ స్టేషన్లోనే భర్తపై భార్య దాడికి యత్నం

బాక్సర్ భార్య , భర్త కబాడీ ప్లేయర్ , ఇద్దరికీ గొడవలొస్తే ? భార్య సవీటి బూరా , బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ , భర్తేమో దీపక్ నివాస్ హుడా , నేషనల్ కబాడీ ప్లేయర్.. ఇద్దరూ పోలీస్ స్టేషన్లోనే గొడవపడ్డారు. భార్య ఆవేశంతో అతడి కాలర్ పట్టుకొని కుర్చీలోనుంచి లాగింది.. ఇంతకీ కధేంటంటే , భార్య ,భర్తలకిద్దరికీ గొడవలొచ్చాయి. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకున్నారు.

పోలీసులు రెండు కుటుంబాలనూ పిలిపించి , గొడవలు సర్దుబాటు అవుతాయేమో ప్రయత్నం చేయమన్నారు. ఈ సందర్భంగా రెండు కుటుంబాల పెద్దలు పోలీస్ స్టేషన్లోనే ఒక గదిలో సమావేశమయ్యారు. ఈ లోగ ఇద్దరిమధ్య గొడవ ముదిరి , మాజీ ప్రపంచ బాక్సర్ అయినా భార్య సవీటి బూరా , భర్త మీదకు ఆడపులిలా విరుచుకుపడింది. రెండు కుటుంబాల పెద్దలు ఇద్దరినీ విడదీశారు..

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.