ఇటీవల కాలంగా తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్న మహిళా అఘోరిగా ప్రచారంలో ఉన్న హిజ్రా శ్రీనివాస్ తన కూతురిని మాయమాటలతో లేపుకుపోయాడని మంగళగిరికి చెందిన ఓ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు ఆ యువతి తండ్రి తురిమెల్ల కోటయ్య మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. తమ కూతురి ఆచూకీ చెప్పాలని కోరాడు.
కూతురు ఇంజనీరింగ్ చదువుతొంది అన్నాడు. నాలుగు నెలల క్రితం ఆశ్రయం ఇచ్చామని చెప్పాడు. అప్పటినుంచి తన కూతురితో ఫోన్ సంబాషణలు చేస్తూ, మాయమాటలతో లోబరుచుకున్నాడని ఆరోపించాడు. అఘోరీలు నిలయానికి నాయకురాలిని చేస్తానని నమ్మించి తీసుకెళ్లాడని ఆవేదన వ్యక్తం చేసాడు.

