తప్పు చేసింది ఆమె.. కానీ ఆ తప్పుని సరిదిద్దే బాధ్యత మాత్రం అందరిదీ.. ఇదీ బెట్టింగ్ యాప్స్ లో ప్రమోషన్లు చేసి అనేక కుటుంబాల్లో చిచ్చు పెట్టిన ప్రమోటర్లలో ఒకరైన యాంకర్ శ్యామల వాదన.. కేసులో ఇరుక్కుని, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా , ఆమె మాత్రం బయట తన తప్పు నేరుగా ఒప్పుకోకుండా , బెట్టింగ్ యాప్స్ ఆపేయాల్సిన బాధ్యత మనందరిదీ అని చెబుతొంది. సోమవారం రోజు ఆమె హైదరాబాద్ పోలీస్ ముందు విచారణకు హాజరై , బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లలో తన ప్రమేయం గురించి చెప్పింది.

ప్రస్తుతం ఆమె వైసిపిలో కీలక నాయకురాలు. ప్రధాన అధికార ప్రతినిధి హోదాలో ఉన్నారు. ఇప్పుడీ కేసులో ఇరుక్కున్న తరువాత టిడిపిపై విమర్శల దాడికి దూరంగా ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ పై ప్రజల్లోకూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ యాప్స్ వల్ల ఎన్నో కుటుంబాలు వీధినపడ్డాయి. కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ యాప్స్ కేసులో ఉన్న ప్రమోటర్లను విచారించి ,యాప్స్ యజమానులను వీరితో పాటు కేసులో ఇరికించాలని పోలీసులు ఆలోచిస్తున్నారని తెలిసింది.

