ఐదేళ్లపాటు జగన్ అధికారంలో ఉన్నప్పుడు వీర విహారం చేసిన బోరుగడ్డ అనిల్ ఇప్పుడు జగన్ కు ఎందుకు దూరం అయ్యాడు ? అతన్ని కనీసం గేటు ముందు కూడా నిలబడేందుకు జగన్ పరివారం ఎందుకు తిరస్కరిస్తుంది..?? వ జగన్ కు, బోరుగడ్డ అనిల్ కు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంత ఆత్మీయ బంధం ఉండిందో అందరికీ తెలుసు. జగన్ ను ఏమైనా అంటే పీక కోసేస్తానని కూడా అప్పట్లో బోరుగడ్డ చెప్పేవాడు. పోలీసులు కూడా బోరుగడ్డకు సాగిలపడి సెల్యూట్ కొట్టేవారు. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఎవరిని ఏమి తిట్టినా నీఛాతి నీచంగా కుటుంబ సభ్యులతో సహా అందరినీ తూలనాడినా అతడిని ఎదిరించే దమ్ము, ధైర్యం, అతడిని అడ్డుకునే పరిస్థితి అప్పట్లో లేదు. ఒకరకంగా అలాంటి పరిస్థితులు వచ్చిన పోలీసు అతడికి అండగా నిలిచేది. అదీ జగన్ హయాంలో బోరుగడ్డ అనిల్ హవా. ఒకరకంగా బోరుగడ్డ అప్పట్లో వైసీపీకి ఎస్సెట్ గా భావించేవారు. అదీ అప్పట్లో అతడి హవా.
.అప్పట్లో బోరుగడ్డకు బోరు దించిన వ్యక్తి ఒకే ఒక్కడు . అది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. శ్రీధర్ రెడ్డి అప్పట్లో జగన్ ముఖ్యమంత్రిగా ఉండగానే, వైసిపి అధికారంలో ఉండగానే విభేదించి దూరం జరిగారు. నెల్లూరులో కొన్ని ఉద్యమాలు చేశారు. అవన్నీ తాను అడిగిన ప్రజా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదని వాటి పరిష్కారం కోసం ధర్నా చేస్తున్నానంటూ పలు రకాలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఇవన్నీ జగన్ కి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమాలు కాబట్టి బోరుగడ్డ అనిల్ ఒక లైవ్ ప్రోగ్రాం లో తీవ్రంగా కోటంరెడ్డిపై విరుచుకుపడ్డాడు. 72 గంటల్లో నెల్లూరుకు వచ్చి నిన్ను కట్టేసి కారుకు కట్టి ట్రంకు రోడ్లో కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ పోతానని హెచ్చరించారు. కానీ మొదటిసారిగా బోరుగడ్డకు సీన్ రివర్స్ అయింది.
దీనికి జరిగిన పర్యవసానం 72 గంటల్లో బోరుగడ్డ అనిల్ కార్యాలయం పూర్తిగా ధ్వంసం, దగ్ధమై ఇంట్లో పర్నిచర్ కూడా చిన్న భిన్నం అయిపోయింది. ఇది చేసింది ఎవరు అనేది ఇప్పటివరకు సస్పెన్స్.. అప్పటినుంచి నోరు మెదపని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం నెల్లూరులో ప్రెస్మీట్లో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ పైన భగవంతుడు, ప్రకృతి ఉంటుంది రెండు బలమైనవే. నన్ను నా తమ్ముడిని 72 గంటల్లో కట్టేసి , నెల్లూరులో కొట్టుకుంటూ తీసుకుపోతాను అన్నాడు . అదే 72 గంటల్లో బోరు గడ్డకి ఏమైందో, వాడికి బోర్ ఎలా దిగిందో అందరికీ తెలిసింది .. అది దేవుడు స్క్రిప్ట్ . అన్ని చూసే దేవుడు ఉన్నాడు . దేవుడు స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందని చెప్పాడు. ఆయన చెప్పింది ఏమిటో ఏమి జరిగిందన్న విషయం అర్ధం చేసుకోవచ్చు.. అది కోటంరెడ్డి స్క్రిప్ట్.. అనుమానం లేదు..

