22.5 C
New York
Tuesday, April 7, 2026

Latest Posts

మావిగన్ వైసిపి కామెడీ షో గా మారిపోయింది

మావిగన్ పేరుతో ఒక విచిత్రమైన రాజధానిని ప్రతిపాదించిన జగన్ మోహన్ రెడ్డి ,దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని విఫల ప్రయత్నాలు చేస్తున్నారు . కానీ వాస్తవం ఏమిటంటే ఈ మావిగన్ ప్రతిపాదన ఒక జోక్ గా మారిపోయింది . ప్రజల్లో ఇది హేళనకు పనికొచ్చే ఒక నినాదంగా మిగిలిపోయింది. వైసీపీ శ్రేణులు కూడా దీనితో ఇబ్బంది పడుతున్నాయి .ఇలాంటి పిచ్చి ప్రకటనలతో అంతర్గతంగా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి పార్టీ నే కాదు తమను కూడా ఇబ్బంది పెడుతున్నాడని ఆడిపోసుకుంటున్నారు . కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో బలవంతంగా మావిగన్ కు అనుకూలంగా ప్రకటనలు ఇచ్చే పరిస్థితిలో మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారు.

అందుకే మావిగన్ ప్రతిపాదన వచ్చిన తర్వాత పార్టీ వర్గాల్లో కదలికలేదని, ఎవరు దీనికి స్పందించడం లేదని తెలిసే పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేత టెలీ కాన్ఫరెన్స్ పెట్టించి అందరూ దీనికి అనుకూలంగా ప్రకటనలు ఇవ్వాలని, దీని గురించి ప్రజల్లో విస్తృతంగా వివరించాలని కోరారు . అయితే అప్పటికే మావిగన్ అనేది ఒక కామెడీ నినాదంగా మారిపోవడంతో ప్రజల దీన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు . ఎందువల్లనో జగన్మోహన్ రెడ్డి కూడా పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు . తన ఆర్డర్ ఆర్డర్ గానే పాటించాలని ,దానికి ఎవరు వివరణ ,సవరణ చెప్పే దానికి లేదని చెప్పేసారు.ఇంతటి కీలకమైన నిర్ణయాన్ని ఆయన ఎవరితో చర్చించకుండానే ప్రకటించేసి, తరువాత దానిపై సీరియస్ గా అందరినీ ప్రకటనలు ఇవ్వమని చెప్పడమే విచిత్రం.

ఇలాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి కోటరీ ఆయనకు భజన్ చేస్తోందన్న విషయాన్ని వైసిపి విశ్లేషకులు బహిరంగంగా చెబుతున్నారు. వాళ్ళ ఆయనకి నిజాలు చెప్పడం లేదని దీన్నేదో పెద్ద ఒక మేధోమథనం చేసిన ఆలోచనగా భావిస్తున్నారని అంటున్నారు . అయితే వాస్తవంగా ఇది వైసీపీకి, జగన్ మోహన్ రెడ్డికి నష్టం కలిగించే అంశం .మావిగన్ సంగతి ఎలా ఉన్నా ముఖ్యమంత్రిగా ఆయన ఉన్న కాలంలో మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాటాడి ఏమీ లేకుండా చేసిన వాస్తవాన్ని ఆ పార్టీ మర్చిపోలేదు . జనం మర్చిపోలేక ఉన్నారు. అందువల్ల ఇప్పటికైనా మావిగన్ ప్రతిపాదన సరైంది కాదని జగన్మోహన్ రెడ్డి గుర్తిస్తే పార్టీ కొద్దిగా అయినా పరువు మిగులుతుంది . లేదంటే ఒక కామెడీ చర్చగా, షో గా మారిపోతుంది.

ఇవి కూడా చదవండి.

ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

ఇదేమి కోరిక తాతయ్యా , విచిత్రంగా ఉందే..

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.