22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

వాహనాలకు క్రాష్ గార్డ్ పెట్టకూడదు

వాహనాలకు బుల్ బార్‌లు, బంపర్‌ గార్డ్‌లను వాడటం చట్టవిరుద్ధం అనే విషయం చాలా మందికి తెలియదు. వాహన భద్రతను దృష్టిలో ఉంచుకుని,’రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ’ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కార్లకు బుల్ బార్‌లు లేదా బంపర్ గార్డ్‌లను 20176లోనే నిషేధించింది.కార్లకు మాత్రమే కాదు,ఈ నిబంధన దాదాపు అన్ని రకాల వాహనాలకు వర్తిస్తుంది. ముఖ్యంగా ,జీపులు లేదా ఇతర కార్లకు అదనంగా అమర్చే మెటల్ గార్డ్‌లు వాహన భద్రత ప్రమాణాలకు విరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు.బంపర్ గార్డ్‌లు కారుకు అదనపు రక్షణ ఇస్తాయని చాలా మంది భావిస్తారు. కానీ భద్రత నిపుణుల ప్రకారం ఇవి ప్రమాద సమయంలో ఎయిర్‌బ్యాగ్ వ్యవస్థ పనితీరును దెబ్బతీసే అవకాశం ఉంది. సాధారణంగా కారు ఢీకొన్నప్పుడు వాహనంలోని సెన్సార్‌లు ప్రభావాన్ని గుర్తించి వెంటనే ఎయిర్‌బ్యాగ్‌లను తెరుస్తాయి.

కానీ ముందు భాగంలో బుల్ బార్ లేదా బంపర్ గార్డ్‌ ఉండటం వల్ల ఆ ప్రభావం సెన్సార్‌లకు సరైన విధంగా చేరకపోవచ్చు.. దీని కారణంగా,కొన్ని సందర్భాల్లో ఎయిర్‌బ్యాగ్‌లు సమయానికి పని చేయకపోవచ్చు. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారికి ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది.బుల్ బార్‌ లేదా బంపర్ గార్డ్‌ కేవలం కారులో ఉన్నవారికే కాకుండా పాదచారులకు కూడా ప్రమాదకరం.ఈ మెటల్ బార్‌లు చాలా దృఢంగా ఉండటం వల్ల ప్రమాద సమయంలో గాయాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది.సాధారణంగా,ప్రమాద సమయంలో పాదచారులపై ప్రభావాన్ని కొంత వరకు తగ్గించేలా కార్ల బంపర్‌లను రూపొందిస్తారు.కానీ బుల్ బార్‌లు ఉండటం వల్ల ఆ రక్షణ తగ్గిపోతుంది. రోడ్డుపై నడిచే వ్యక్తులకు తీవ్రమైన గాయాలు అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

కారుకు బుల్ బార్ లేదా బంపర్ గార్డ్ అమర్చడం మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం నేరం. సెక్షన్ 190 & 191 కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంది.ట్రాఫిక్ పోలీసులు తనిఖీల సమయంలో వాహనంలో బుల్ బార్ కనిపిస్తే రూ.1000 నుంచి రూ.5000 వరకు జరిమానా విధించవచ్చు. అదేవిధంగా,రోడ్లపై బుల్ బార్‌తో వాహనం నడుపుతున్నట్లు గుర్తిస్తే, అక్కడికక్కడే వాటిని తొలగించే అధికారం కూడా ట్రాఫిక్ పోలీసులకు ఉంటుంది.. చాలా మంది స్టైల్ కోసం లేదా కారుకు రక్షణ కోసం బుల్ బార్‌లను అమర్చుకుంటున్నారు. కానీ ఇవి చట్టపరంగా నిషేధితమైనవే కాకుండా భద్రత పరంగా కూడా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.అందుకే మీ కారులో బుల్ బార్ లేదా బంపర్ గార్డ్ ఉంటే వెంటనే తొలగించడం మంచిది. లేకపోతే ట్రాఫిక్ పోలీసులు తనిఖీ సమయంలో జరిమానా తప్పకపోవచ్చు.

ఇవి కూడా చదవండి.

ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

ఇదేమి కోరిక తాతయ్యా , విచిత్రంగా ఉందే..

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.