22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

కళ్ళముందే భార్య వేరేవాడితో తిరుగుతొంది..

తన కళ్ళముందే భార్య వేరేవాడితో తిరుగుతొంది, ఇద్దరు బిడ్డలను వదిలేసింది. పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేదు. అందుకే ఓ వ్యక్తి తన భార్య ప్రియుడిని నడిరోడ్లో తుపాకీతో కాల్చేసి చంపేశాడు. అక్కడే తీరికగా సిగరెట్ వెలిగించి , నాలుగు నిముషాలు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి , ఇక నువ్వే టార్గెట్ అంటూ హెచ్చరించి, ఆ వీడియోను పోలీసులకు కూడా పంపాడు.ఒకటిన్నర సంవత్సరంగా మీకు చెబుతున్నా , మీరేమీ చేయలేక పోయారు ,

అందుకే నేనే చర్య తీసుకున్నా అంటూ చెప్పాడు. ఇక్కడేఉన్నా , వచ్చి అరెస్ట్ చేయండి. బెయిల్ వచ్చిన తరువాత నా భార్య సంగతి చూసుకుంటా అంటూ చేయబోయేది కూడా చెప్పేసాడు.ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగిందీ సంఘటన. చనిపోయిన వ్యక్తి సురేంద్ర, చంపిన వ్యక్తి ప్రదీప్. ప్రదీప్ బార్యతోనే సురేంద్ర సహజీవనం చేస్తున్నాడు. విడాకులు తీసుకుని విడిగా ఉండమని చెప్పినా వినకపోవడంతో ఇలా చేసాడు.

ఇవి కూడా చదవండి.

ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

ఇదేమి కోరిక తాతయ్యా , విచిత్రంగా ఉందే..

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.