ఫెడరల్ వ్యవస్థకు, ప్రజాస్వామ్య స్ఫూర్తి కి ఒక వెలుగు దీపంలా ఉండాల్సిన అమెరికా అధ్యక్షులలో కొంతమంది ఉన్మాదంతో ,అహంకారంతో , ఆధిపత్య పిచ్చితో వినాశనం సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ పై ట్రంప్ చేస్తున్న యుద్ధం కూడా అలాంటిదే. 2002లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఇరాక్ పై అణ్వాయుధాలు , రసాయనిక ఆయుధాలు ఇలాంటి మాయమాటలు చెప్పి అందరిని భ్రమింపజేసి భారీ స్థాయిలో యుద్ధం చేశాడు .అయితే ఇరాక్ ను చేజిక్కించుకున్న తర్వాత సద్దాం హుస్సేన్ ను హతమార్చి తర్వాత ఒక్క అణుబాంబుగానీ ,ఒక్క రసాయనిక బాంబుగానీ అక్కడ కనిపించలేదు . ప్రపంచానికి ఏమీ చెప్పలేకపోయాడు . అలాంటి పరిస్థితి ఇప్పుడు ట్రంప్ నేతృత్వంలో అమెరికా, ఇరాన్ పై చేస్తున్న యుద్ధం.
తను ఒక వైపు తప్పులు చేస్తూనే మరోవైపు ప్రపంచ పోలీస్ పాత్ర పోషించాలన్న దురహంకారంతో అమెరికా వ్యవహరిస్తోంది . చుట్టూ గల్ఫ్ దేశాల్లో తన వైమానిక ,సైనిక ,నావికా స్థావరాలను ఏర్పాటు చేసుకొని ముస్లిం దేశాలను తన గుప్పెట్లో పెట్టుకుని ఇరాన్ ను బెదిరించాలని చూస్తోంది .చర్చలు లేదా అంతర్జాతీయ వేదికల మీద సమస్యల పరిష్కారం చేసుకోవడం ఒక సాంప్రదాయం, అది రాజనీతి . లేదంటే ప్రపంచ వేదికలపై ఆ దేశాలను ఏకాకిని చేయడం రాజధర్మం.. అలాకాకుండా తమతో స్నేహంగా ఉన్న దేశాలపై కూడా , తనకు గిట్టని దేశాలతో సంబంధాలు పెట్టుకోవద్దని ,ఆర్థికపరమైన ఆంక్షలు లేదా ఎగుమతి దిగుమతులపై ఆంక్షలు లేదా సైనిక పరమైన ఆంక్షలు పెట్టే ఒక ఉన్మాద మనస్తత్వం ట్రంప్ స్వంతం .
ఇరాన్ తన దారికి రాకపోవడంతో యుద్దమైన చేసి ఆ దేశాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుంటామన్న ఒక దుర్మార్గమైన ,దురాలోచన ట్రంప్ లో కనిపిస్తుంది . ఆనాడు బుష్ ఇరాక్ పై చెప్పిన అబద్ధాలే ఈరోజు ట్రంప్ కూడా చెబుతున్నాడు . భారత్ రష్యాతో స్నేహంగా ఉందని , పాకిస్తాన్ గొప్ప ప్రజాస్వామిక దేశమని పొగిడిన పిచ్చోడు ట్రంప్ . మానసిక శాస్త్రవేత్తలు విశ్లేషణ ప్రకారం ట్రంప్ పచ్చి నియంతని , పరమ క్రూరుడని కూడా అంటారు .ఇటీవల కాలంలో ట్రంప్ చేసిన పిచ్చి పనులన్నింటినీ ఆ దేశ సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించి రద్దు చేసిన విషయం కూడా తెలిసిందే . అమెరికాలోనే చాలామంది మానసిక శాస్త్రవేత్తలు ట్రంప్ ను మానసిక రోగి అంటారు.
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

