అపురూపమైన బాల్యం మొబైల్ ఫోన్లలో కరిగిపోతుంది. తల్లిదండ్రులు ఎవరైనా సరే నిదానంగా ఆలోచిస్తే పిల్లలకి ఫోన్ ఇచ్చేసి వారిని వారికి అన్నం పెట్టాలని , లేదా తమ పనికి అడ్డంగా ఉన్నారని ఫోన్ ఇచ్చేసి కాలం గడుపుకునే తల్లిదండ్రులకు ఇదో హెచ్చరిక . ప్రతి మొబైల్ ఫోన్లో పిల్లల భవిష్యత్తుని బలి తీసుకునే మహాభూతం ఉంది. ఆటపాటలతో, స్నేహితులతో గడపాల్సిన అపూరూపమైన బాల్యం , సెల్ ఫోన్ స్క్రీన్ లో కరిగిపోతొంది. డెన్మార్క్ లో 15 సంవత్సరాల వయసు లోపు పిల్లలకు మొబైల్ ఫోన్ ఇవ్వకూడదని, సోషల్ మీడియా భూతం నుంచి వారిని దూరం చేయాలని ఆ దేశ పార్లమెంటు బిల్లు రూపొందించింది. దీనికి చట్టరూపం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది .దేశంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నాయి. ఆదేశ ప్రధానమంత్రి ఫెడరర్ ఈ విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారు.
సోషల్ మీడియా కలియుగంలో ఒక రాక్షసి
ఆమె సోషల్ మీడియాను ఒక భూతంగా ,కలియుగంలో ఒక మహా రాక్షసిగా వర్ణిస్తున్నారు. అపురూపమైన పిల్లల బాల్యాన్ని చోరీ చేసే ఓ పెద్ద దొంగగా ఆమె సోషల్ మీడియాను విమర్శిస్తున్నారు. డెన్మార్క్ లో 94 శాతం పిల్లలు 13 ఏళ్లకు దిగువనున్నవారు సోషల్ మీడియా ప్రొఫైల్స్ కలిగి ఉన్నారు. వయసుకు సంబంధించి సోషల్ మీడియా నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని తప్పుగా చూపించి సోషల్ మీడియాలో భాగస్వాములు అయిపోతున్నారు . వీరిలో 60 శాతం మంది అబ్బాయిలు 11 నుంచి 19 ఏళ్ల లోపు వారు . దాదాపుగా 40 శాతం మందికి ఈ సోషల్ మీడియా భూతం వల్ల స్నేహితులే లేకుండా పోయారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్ తోనే కాలం గడిపేస్తూ అపురూపమైన బాల్యాన్ని దాంట్లో కరిగించుకుంటూ మరుపురాని అనుభూతులను ఆస్వాదించకుండా ,స్నేహితులను కూడా వదులుకున్నారు.
సోషల్ మీడియా వల్ల పిల్లలు ఆందోళన మానసిక ఒత్తిడి
ఈ మొబైల్ ఫోన్ వల్ల ,సోషల్ మీడియా వల్ల పిల్లలు ఆందోళన మానసిక ఒత్తిడి పెరుగుతున్నాయని ,నిద్ర నిద్రకు కూడా దూరమవుతున్నారని, పిల్లల్లో ఏకాగ్రత లోపిస్తుందని ,ఇవన్నీ కాక ఆ మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్ పిల్లలు ఆరోగ్యానికి మహా ప్రమాదకరంగా పరిణమించిందని డెన్మార్క్ డిజిటల్ అఫైర్స్ మంత్రి చెప్తున్నాడు. సోషల్ మీడియా ప్లాట్ఫార్మర్స్ కు పిల్లలను దూరంగా ఉంచేందుకు, వారి ఆరోగ్యాన్ని జాగ్రత్త చేసేందుకు అన్ని రకాల అవకాశాలు ఉన్నప్పటికీ వారు ఆ పని చేయడం లేదని ,అందువల్లనే ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని చెప్పారు, ఇప్పటికే డెన్మార్క్ ప్రభుత్వం ఎలిమెంట్రీ పాఠశాల నుంచి మొబైల్ ఫోన్లను బహిష్కరించింది . ఆస్ట్రేలియా కూడా అదే దారిలో నడుస్తోంది . 16 ఏళ్ల లోపు వయసు పిల్లలు మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదని ఒక చట్టం కూడా చేసింది. నార్వే కూడా అదే దారిలో నడుస్తోంది. ప్రపంచం, ముఖ్యంగా తల్లితండ్రులు ఈ విషయంలో తీవ్రంగా ఆలోచించకపోతే , పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన వారవుతారు.
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

