పక్షులకు ఉన్న అద్భుత గ్రహణ శక్తి బహుశా ఏ ప్రాణిలోనూ ఉండదు. పక్షులు తమ గమనాన్ని, తమ గమ్యాన్ని కచ్చితంగా నిర్దేశించుకుని పాటిస్తాయి. వలస పక్షులు అయితే కొన్ని వేల కిలోమీటర్లు ప్రతి ఏడాది తాము వలస పోయే ప్రాంతాలకు అదే మార్గంలో ప్రయాణించి చేరుకుంటాయి . అదే సృష్టిలో ఒక అద్భుతమైన రహస్యం. ఇటీవల విదిష వన్య సంరక్షణ కేంద్రంలో ఓ రాబందు గాయపడింది. ఎగరలేని విధంగా దాని రెక్కలు దెబ్బతిన్నాయి. ఈ రాబందును వైద్యులు తమ సంరక్షణలో ఉంచుకొని దానికి వైద్యం చేశారు . ఈ ఏడాది జనవరి నెలలో ఈ రాబందు గాయపడింది . గాయపడిన రాబందును పక్షి సంరక్షణ కేంద్రంలో ఉంచి మార్చినాటికల్లా దానికి వైద్యం పూర్తి చేశారు. ఆ తర్వాత కొంతకాలం పాటు రాబందును తమ రక్షణలో ఉంచుకొని అది సొంతంగా ఎగర గలదు అనుకున్న సమయానికి దాన్ని వదిలిపెట్టారు .
రాబందు కాలికి జిపిఎస్ ట్రాకింగ్ కట్టి వదిలిపెట్టేశారు
అతి పెద్ద రెక్కలు గల ఈ రాబందులు రెక్కల దెబ్బతింటే ఎగర లేవు . ఈ రాబందుకు వైద్యం పూర్తయిన తర్వాత దాని కాలికి జిపిఎస్ ట్రాకింగ్ కట్టి వదిలిపెట్టేశారు. ఆ తర్వాత దాన్ని గమనాన్ని ట్రాక్ చేస్తూ వచ్చారు .గ్రిఫిన్ జాతికి చెందిన ఈ రాబందు దాదాపు 15,700 కిలోమీటర్లు ప్రయాణం చేసి కజకిస్థాన్లో కొన్ని నెలల పాటు ఉండి అక్కడ వాతావరణ పరిస్థితులు ప్రతికూలించే సమయానికి రెండు వారాల క్రితం మళ్లీ తిరిగి భారతదేశానికి చేరుకుంది . తన ప్రాంతమైన విదిష వన్య ప్రాణి సంరక్షణ కేంద్రానికి చేరుకుంది . ఆ తర్వాత శాస్త్రవేత్తలు ఈ పక్షిని పట్టుకొని దానికి వేసిన జిపిఎస్ ట్రాకింగ్ పూర్తి చేసి అది ప్రయాణించిన మార్గాన్ని పరిశీలించారు . ప్రతి ఏడాది గతంలో కూడా గ్రీన్ పక్షులు విదేశానికి వలస వెళ్లేటప్పుడు అదే మార్గంలో వెళతాయి అక్కడే ఉంటాయి ఆ తర్వాత అక్కడ నుంచి వెనక్కి తిరిగి స్వస్థలాలకు వచ్చేస్తాయి పక్షుల వలస మార్గాలను వలస దేశాలను ఖండాంతరాలలో పక్షులు వలస వెళ్లే విధానాలను అధ్యయనం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది .
గ్రిఫిన్ రాబందు ప్రయాణం జిపిఎస్ విధానం ద్వారా..
జాతి తారతమ్యం లేని పక్షులను ప్రపంచ దేశాలు ఎలా కాపాడుకోవాలో వలస పక్షుల సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ సంఘటన నిరూపిస్తోంది . పక్షులు రాత్రి సమయాల్లో నక్షత్రాలు ,పగటి సమయాల్లో సూర్య గమనాన్ని మరియు భూ అయస్కాంత క్షేత్రాలను అంచనా వేస్తూ అవి తమ ప్రయాణాలను కొనసాగిస్తాయి . ఇంతటి అద్భుతమైన శక్తి పక్షులకు ఎలా అన్నది ఆ సృష్టికర్తకే తెలియాలి . దీంట్లో మరో విశేషం ఉంది . కొన్ని పక్షులు వలస పోయే అప్పుడు సముద్రం మీద వలసపోవు . కొన్ని పక్షులు సముద్రం మీద మాత్రమే వలస ప్రయాణం చేస్తాయి. రాబందులు మాత్రం భూమి ,కొండలు ఆధారంగానే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తాయి . ఒకవేళ సముద్రం వస్తే తిరిగి మళ్లీ భూ మార్గంలోనే దేశాలను చుట్టి గమ్యస్థానాన్ని చేరుకుంటాయి . గ్రిఫిన్ రాబందు ప్రయాణం జిపిఎస్ విధానం ద్వారా పరిశీలిస్తే రాజస్థాన్లోని విదీషనుంచి బయలుదేరిన రాబందు పాకిస్తాన్ ,ఆఫ్ఘనిస్తాన్ తజకిస్తాన్ ,ఉజ్బెకిస్తాన్ దేశాల మీదుగా కజకిస్తాన్ కు చేరుకుంది ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో కూడా అదే దారిన తిరిగి వచ్చింది . ఇది పక్షుల్లో ఉన్న అద్భుతమైన అతింద్రియమైన జ్ఞానం . మనకి అర్థం కాని పరమార్థం సృష్టి రహస్యం.
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

